Sonam Kapoor Blind Gets A Streaming Date - Sakshi
Sakshi News home page

నిజాలను చూడటం కష్టం!

Published Tue, Jun 27 2023 1:34 AM | Last Updated on Mon, Jul 31 2023 8:23 PM

Sonam Kapoor Blind gets a streaming date - Sakshi

‘‘కొన్నిసార్లు నిజాలను చూడటం చాలా కష్టం.. మరి మీరు ఆమె చీకటి ప్రపంచాన్ని చూడ్డానికి రెడీ అవుతారా?’’ అంటూ సోనమ్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం ‘బ్లైండ్‌’ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 7 నుంచి ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కొరియన్‌ మూవీ ‘బ్లైండ్‌’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో సోనమ్‌ అంధురాలిగా నటించారు.

ఓ సీరియల్‌ కిల్లర్‌ను పట్టుకోడానికి ఓ లేడీ పోలీసాఫీసర్‌ చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. బ్లైండ్‌ పోలీసాఫీసర్‌గా సోనమ్‌ అద్భుతంగా నటించారని చిత్ర యూనిట్‌ పేర్కొంది.. షోమ్‌ మఖీజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సోనమ్‌ కనిపించనున్న తొలి చిత్రం ఇదే కాగా, తల్లయ్యాక (గత ఏడాది ఆగస్ట్‌ 20న ఓ బాబుకి జన్మనిచ్చారు) కనిపించనున్న చిత్రం కూడా ఇదే అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement