శ్రుతీ నాగ్‌ ఓ వెబ్‌ ఫిల్మ్‌? | Shruti Haasan To Star In Nag Ashwin Web Film | Sakshi
Sakshi News home page

శ్రుతీ నాగ్‌ ఓ వెబ్‌ ఫిల్మ్‌?

Published Mon, Sep 28 2020 1:29 AM | Last Updated on Mon, Sep 28 2020 5:17 AM

Shruti Haasan To Star In Nag Ashwin Web Film - Sakshi

నాగ్‌ అశ్విన్, శ్రుతీహాసన్

ప్రస్తుతం స్టార్స్‌ అందరూ ఓటీటీ బాటపట్టారు. ఓటీటీలకు షోలు, సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్‌ ఫిల్మ్‌ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్, హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కలిసారని సమాచారం. శ్రుతీహాసన్‌ లీడ్‌ రోల్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభించారట నాగ్‌. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతున్న ఈ సినిమా నిడివి 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఉంటుందని టాక్‌.

వారం రోజుల్లోనే చిత్రీకరణను దాదాపుగా పూర్తి చేయడం విశేషం. ఈ వెబ్‌ ఫిల్మ్‌ కోసం ప్రత్యేకంగా ఓ స్టూడియో సెట్‌ను నిర్మించారని టాక్‌. ఓ బలమైన పాయింట్‌ను ఈ వెబ్‌ ఫిల్మ్‌లో చర్చించారట నాగ్‌ అశ్విన్‌. ఈ సినిమా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్‌తో చేయబోయే భారీ బడ్జెట్‌ సినిమా ప్రీ – ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉన్నారు నాగ్‌ అశ్విన్‌. అలానే ‘క్రాక్, వకీల్‌సాబ్‌’ చిత్రాలతో శ్రుతీహాసన్‌ బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement