
లాక్‌డౌన్ వల్ల థియేటర్స్ మూతబడటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు పాపులారిటీ మరింత పెరిగింది. సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. చాలా మంది స్టార్స్ వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి సై అంటున్నారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకున్నారని తెలిసింది. ఈ డీల్‌లో భాగంగా షాహిద్ నటించబోయే మూడు సినిమాలు నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లోనే విడుదలవుతాయి. ప్రస్తుతం ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు షాహిద్. ఈ సినిమా తర్వాత చేయబోయే ‘ఆపరేషన్ క్యాక్టస్’ చిత్రం నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ కోసం మరో రెండు సినిమాలు చేయబోతున్నారు షాహిద్.
Comments
Please login to add a commentAdd a comment