
ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజకు పూర్వవైభవం తీసుకువచ్చిన మూవీ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని- రవితేజ కాంబోలో రూపొందిన ఈ హ్యాట్రిక్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ‘క్రాక్’ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. తెలుగు వారి ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం నాటికి 250 మిలియన్ నిమిషాల వ్యూయర్ షిప్ సాధించి ‘ఆహా’ పాత రికార్డులను బద్దలుగొట్టాడు పోతరాజు వీరశంకర్. ఈ విషయాన్ని ఆహా టీం అధికారికంగా వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ కంటిన్యూస్ అంటూ ఇప్పటివరకు 25 కోట్ల నిమిషాల పాటు స్ట్రీమ్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు ఆహాలో హైయ్సెస్ట్ వ్యూస్ రికార్డు కలర్ ఫొటో సినిమా పేరిట ఉండేది. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన క్రాక్ ఓటీటీలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోందంటూ రవితేజ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
చదవండి: రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే!
Blockbuster run continues 🔥#KrackOnAHA crosses 250 million viewing minutes of all your love!@RaviTeja_offl @shrutihaasan @megopichand @MusicThaman @TagoreMadhu @TheKrackMovie pic.twitter.com/XoRufQNoR8
— ahavideoIN (@ahavideoIN) February 26, 2021