
థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఒకవేళ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా? అనేది పెద్ద డౌట్. ఆల్రెడీ చిన్న సినిమాలు మెల్లిగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. హిందీలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టాయి. కానీ తెలుగులో పెద్ద సినిమా ఏదీ ఓటీటీలో విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన ‘వి’ చిత్రం నేరుగా ఓటీటీలో (అమెజాన్ ప్రైమ్) విడుదల కానున్నట్టు సమాచారం.
దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వారం రానుందని తెలిసింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించారు. దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు సమాచారం. సౌత్ లో ఇంత వ్యయంతో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ చిత్రమిదే అవుతుంది. అదితీ రావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్ లో 25వ చిత్రం.
Comments
Please login to add a commentAdd a comment