ఇది అన్యాయం | Sushant Singh Rajput 'Dil Bechara goes direct OTT | Sakshi
Sakshi News home page

ఇది అన్యాయం

Published Fri, Jun 26 2020 6:16 AM | Last Updated on Fri, Jun 26 2020 6:16 AM

Sushant Singh Rajput 'Dil Bechara goes direct OTT - Sakshi

‘‘ఇలా జరగడానికి వీల్లేదు. సుశాంత్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటే, అతనికి నిజమైన నివాళి ఇవ్వాలంటే ‘దిల్‌ బేచారా’ సినిమాని థియేటర్లో విడుదల చేయాల్సిందే. లేకపోతే తనకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు’’ అంటూ పలువురు నెటిజన్లు ‘దిల్‌ బేచారా’ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్‌ సింగ్‌ నటించిన చివరి సినిమా ఇది. ఈ చిత్రాన్ని జూలై 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం సుశాంత్‌ అభిమానులను నిరుత్సాహపరిచింది.

‘‘సుశాంత్‌ని చివరిసారిగా బిగ్‌ స్క్రీన్‌ మీద చూసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఇది మా విన్నపం’’ అంటున్నారు ఫ్యాన్స్‌. ‘ఫాక్ప్‌ స్టార్‌ స్టూడియోస్‌’ నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్నీ, హాట్‌స్టార్‌ విడుదల చేయనున్నాయి. మరి.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంపట్ల సుశాంత్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, సంస్థ అధినేతలు నిర్ణయాన్ని మార్చుకుంటారా? వేచి చూడాలి. సుశాంత్‌ గత చిత్రం ‘డ్రైవ్‌’ కూడా ఓటీటీలోనే విడుదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement