అనగనగా ఓ అతిథిలో ‘పాయల్’‌ | Anaganaga O Athidhi ott streaming release date on aha video | Sakshi
Sakshi News home page

ఓ అతిథి

Published Tue, Nov 17 2020 6:19 AM | Last Updated on Tue, Nov 17 2020 7:23 AM

Anaganaga O Athidhi ott streaming release date on aha video - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆర్‌ఎక్స్‌ 100, ఆర్‌డీఎక్స్‌ లవ్, డిస్కోరాజా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఓ అతిథి’. చైతన్య కృష్ణ, ఆనంద్‌ చక్రపాణి, వీణ సుందర్‌ కీలక పాత్రల్లో నటించారు. దయాల్‌ పద్మనాభన్‌ దర్శకత్వం వహించారు. రాజా రామామూర్తి, చిందబర్‌ నటీశన్‌ నిర్మించిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో ఈ నెల 20న విడుదల కానుంది. రాజా రామామూర్తి, చిందబర్‌ నటీశన్‌ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అనుకోని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిథి కారణంగా ఎదురయ్యే సమస్యలు ఏంటి? అనే కథాంశంతో  దయాల్‌ అత్యంత ఉత్కంఠ కలిగేలా తెరకెక్కించాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాకేష్‌ బి, సంగీతం: ఆరోల్‌ కోరెల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement