Pizza2
-
భయపెట్టిస్తోన్న ‘పిజ్జా 3 ది మమ్మి’ గ్లింప్స్
అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తోన్న హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పిజ్జా 3 ది మమ్మీ’. సీవీ కుమార్ నిర్మాణంలో రూపొందిన పిజ్జా 2 కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్‌గా ఈ మూవీ నిలిచింది. అంతేగాక విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సీవీ కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్‌తో ‘పిజ్జా 3 ది మమ్మీ’చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో డైరీ ఫేమ్ పవిత్రా మారిముత్తు హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ గ్లింప్స్‌ను విడుదల చేయడం ద్వారా స్టార్ట్ చేసింది. గ్లింప్స్‌లో ప్రతి సీన్ భయం పుట్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ అంచనాలు మరింత పెరిగాయి. గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళి వెంకట్, అనుపమ కుమార్, రవీనా దాహ, కురైసి, యోగి, సుభిక్ష ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. పిజ్జా2కు సీక్వెల్‌గా పిజ్జా3ని ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. -
పిజ్జా 2
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉండగా తాజాగా ‘ఫిలిమ్’ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాబోతోంది. విజయదశమి ముందు లాంచ్ కానున్న ఈ ఫిలిమ్ ఓటీటీలో విడుదల కానున్న తొలి చిత్రం విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా 2’. ‘‘ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 13న విడుదలైంది. అయితే సినిమా రిలీజైన వెంటనే లాక్ డౌన్ మొదలయింది. దీంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు ఫిలిమ్ ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నాం. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘పిజ్జా 2’ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత డి. వెంకటేష్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గాయత్రి కథానాయికగా నటించారు. -
‘విల్లా’లో ఏం జరిగింది?
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘విల్లా’(పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈ నెల 14న ‘విల్లా’ విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ -‘‘పంపిణీదారుల్ని దృష్టిలో పెట్టుకొని మేం సినిమాను ఎంపిక చేస్తాం. అందుకే మా సంస్థ ద్వారా వచ్చిన ప్రతి సినిమా పంపిణీదారులకు లాభాలనే తెచ్చిపెట్టింది. ‘విల్లా’లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘విల్లా’ పాటలు, ప్రచార చిత్రాలు మంచి స్పందన చూరగొంటున్నాయి. సినిమా కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని నా నమ్మకం’’ అని చెప్పారు.