విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘పురియాద పుదిర్’. ఈ చిత్రం ‘పిజ్జా–2’ పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. డీవీ సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకాలపై ఉదయ్ హర్ష వడ్డేల్ల, డీవీ వెంకటేష్ ‘పిజ్జా 2’ని డిసెంబరు మొదటి వారంలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘‘అభివృద్ధి చెందిన సాంకేతిక సాయంతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్య ప్రధానాంశంగా ఈ సినిమా సాగుతుంది. థ్రిల్లర్ జానర్‌లో రూపొందింది. విజయ్ సేతుపతి నటన సినిమాకు హైలైట్’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment