గాయత్రి డబుల్ ధమాకా | All India Sub-Junior Ranking Badminton | Sakshi
Sakshi News home page

గాయత్రి డబుల్ ధమాకా

Published Mon, Oct 26 2015 2:44 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM

గాయత్రి డబుల్ ధమాకా - Sakshi

గాయత్రి డబుల్ ధమాకా

గుంటూరు: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి, పుల్లెల గోపీచంద్ తనయ గాయత్రి సత్తా చాటుకుంది. ఈ టోర్నీలో ఆమె డబుల్ ధమాకా సాధించింది. బాలికల అండర్-13 సింగిల్స్, అండర్-15 డబుల్స్‌లో గాయత్రి విజేతగా నిలిచింది. అండర్-13 ఫైనల్లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె 21-12, 21-14తో తెలంగాణకే చెందిన సామియాపై గెలిచింది. డబుల్స్ ఫైనల్లో గాయత్రి-వైష్ణవి రెడ్డి జంట 22-20, 21-13తో శ్రుతి-అమోలికా (ఉత్తరప్రదేశ్) జోడిపై గెలిచింది. బాలికల అండర్-13 డబుల్స్ టైటిల్ పోరులో సామియా (తెలంగాణ)-కవిప్రియా (పుదుచ్చేరి) ద్వయం 21-14, 21-13తో అదితి- స్నేహ(ఉత్తరాఖండ్) జంటపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement