దుర్గ గుడిలో మాయమైన 18 వేల రూపాయలు విలువజేసే పట్టుచీర
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు పాలనలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా దేవికి సైతం రక్షణ కరవైందని బీజేపీ అధికార ప్రతినిధి గాయత్రి మండిపడ్డారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె టీడీపీ పాలనలో టీడీపీ పాలనలో అమ్మాయిలకే కాకుండా, సాక్షాత్తు దుర్గమ్మకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
భక్తులు సమర్పించిన సారెలో చీర మాయమైతే, ఇప్పటివరకూ విచారణ చేపట్టకపోవడంపై ప్రభుత్వ తీరును ఆమె ఎండగట్టారు. భక్తుల మనోభావాలతో టీడీపీ నాయకులు ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని, శివ స్వామిని హౌస్ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
దుర్గగుడి పాలకమండలి ఒక అరాచక శక్తిగా తయారు అయ్యిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాత ఈవో సూర్యకుమారి ఉన్నప్పుడు 50 లక్షల రూపాయల చీరలు మాయం చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేత తిరుపతిలోని వజ్రాలు మాయం చేస్తుంటే...మేం తక్కువ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు దుర్గ గుడిలో చీరలు మాయం చేస్తున్నారని విమర్శించారు. చీర మాయం విషయంపై ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని గాయత్రి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment