సైలెంట్‌గా... కూల్‌గా | mohan babu movie update | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా... కూల్‌గా

Published Fri, Dec 15 2017 12:26 AM | Last Updated on Fri, Dec 15 2017 12:26 AM

mohan babu movie update - Sakshi

హంగామా లేకుండా మొదలుపెట్టారు. హడావిడి లేకుండా షూటింగ్‌ చేశారు. కూల్‌గా కంప్లీట్‌ చేశారు. మోహన్‌బాబు హీరోగా నటించిన‘గాయత్రి’ సినిమా గురించే చెబుతున్నాం. సైలెంట్‌గా షూటింగ్‌ చేసేసి, రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించేశారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మోహన్‌బాబు తెలిపారు. సినిమానైతే కూల్‌గా కంప్లీట్‌ చేశారు కానీ, ఇందులో మోహన్‌బాబు మాత్రం కూల్‌గా కనిపిస్తారని చెప్పలేం. ఆయన స్టైల్‌కి తగ్గట్టుగా సూపర్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ చేశారట.

‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్‌ మదన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్‌ చేశారు. ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో మంచు విష్ణు కనిపిస్తారు. శ్రియ కీలక పాత్ర చేశారు. ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం గురువారంతో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. బ్రహ్మానందం, అనసూయ ఇతర ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేశ్‌ మురారి, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయకుమార్‌ ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement