
సాక్షి, హైదరాబాద్ : విలక్షణ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్పందించారు. మోహన్‌బాబు లాంటి సీనియర్ నటులు తనను విమర్శించినా అవి తనకు ఆశీర్వాదంలాగే తీసుకుంటానని తమన్ వ్యాఖ్యానించారు. గాయత్రి సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా "తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు" అంటూ మోహన్‌బాబు, తమన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సంఘటన జరిగిన చాలా రోజులు తర్వాత తమన్ స్పందించారు. పాటలు ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గాయత్రికి మంచి మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారని, అందుకే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది తనకి ఆశీర్వాదం లాంటిదేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment