
అమ్మకు అవమానం
గాయత్రీబోస్‌కి 33 ఏళ్లు. ఇండియన్. సింగపూర్‌లో ఉంటోంది. ఇద్దరు పిల్లలు. మూడున్నరేళ్లు, ఏడున్నర నెలల పిల్లలు. గాయత్రి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మేనేజర్. పని మీద ఈ మధ్య జర్మనీ వెళ్లింది. అక్కడి నుంచి ప్యారిస్ వెళ్లాలి. ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ రెడీగా ఉంది. ఈలోపు ఆమెను సెక్యూరిటీలో ఆపేశారు. ఆమె క్యారీబ్యాగ్‌ను స్క్రీన్ చేస్తున్నప్పుడు అందులో ‘బ్రెస్ట్ పంప్’ కనిపించింది. (బిడ్డ కోసం బాటిల్‌లో పాలు పట్టి ఉంచడానికి వర్కింగ్ మదర్స్ అ బ్రెస్ట్ పంప్ ఉపయోగిస్తారు).
‘‘బ్రెస్ట్ పంప్ సరే, బిడ్డ ఎక్కడ?’’అని అడిగారు అధికారులు. గాయత్రీ తనతోపాటు బిడ్డను తెచ్చుకోలేదు. ‘‘బేబీ, సింగపూర్‌లో ఉంది’’ అని చెప్పింది. వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే మహిళా సిబ్బందిని పిలిపించి ‘డీప్’గా చెక్ చెయ్యమని పురమాయించారు. చెకింగ్ కోసం లోపలికి వెళ్లిన గాయత్రీ కన్నీళ్లతో బయటికి వచ్చింది. ఏడ్చుకుంటూనే ప్యారిస్ ఫ్లయిట్ ఎక్కింది.
ఇంతకీ లోపల ఏం జరిగింది?
‘ఒక్కదానివే ప్రయాణిస్తున్నావు. ఈ బ్రెస్ట్ పంప్ ఎందుకు?’ అని అడిగారు. ‘నువ్వు నిజంగానే బిడ్డ తల్లివా?’ అని అడిగారు. ‘రుజువేమిటి?’ అన్నారు. అక్కడితో ఆగలేదు. బ్లవుజ్ ఓపెన్ చెయ్యమన్నారు. బ్లవుజ్ ఓపెన్ చేశాక.. పాలు వస్తున్నాయో లేదో చూడాలి.. కొద్దిగా నొక్కి చూపించు అన్నారు. గాయత్రి వాళ్లు చెప్పినట్లే చేసింది. ఆ తర్వాత మాత్రమే వాళ్లు ఆమెను వదిలిపెట్టారు. కానీ ఆమె వాళ్లను వదిలిపెట్టదలచుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ‘బ్రెస్ట్ చూపించాల్సి రావడం ఎంత అవమానం’ అని ఆవేదన చెందుతోంది గాయత్రి.
‘‘బ్రెస్ట్ పంప్