
హతురాలు గాయత్రి(ఫైల్)
యాదాద్రి: ప్రేమోన్మాది శ్రీకాంత్ ఇంటి ముందు గాయాత్రి మృతదేహంతో ఆమె బంధువులు ఆందోళనకు దిగడంతో ఆదివారం యాదగిరిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బంధువులు.. ఒక దశలో కోపం పట్టలేక శ్రీకాంత్ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. అప్రమత్తమైన పోలీసులు.. వారిని నిలువరించేప్రయత్నం చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ, శ్రీకాంత్‌ను శిక్షించే వరకూ కొనసాగిస్తామని గాయత్రి బంధువులు హెచ్చరించారు.
యాదాద్రి దేవస్థానంలో మాలిగా పనిచేస్తోన్న సూదగాని సాయులు కుమార్తె గాయత్రి(20)ని యాదగిరిపల్లెకే చెందిన శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది శనివారం కత్తితో పొడిచి చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. డిగ్రీ పూర్తిచేసిన గాయత్రికి ఇటీవలే ఓ పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అంతలోనే అనూహ్యంగా హత్యకు గురికావడంతో ఆమె కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది. హంతకుడు శ్రీకాంత్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు.
చదవండి: ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు!
ఇంట్లో ఉంటే మమ్మల్నీ చంపేవాడు: గాయత్రి తండ్రి