
యోగ్‌జకార్తా (ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి 21–8, 21–12తో విక్టోరియా (ఇండోనేసియా)పై, రెండో రౌండ్‌లో 21–4, 21–11తో అనికా బెస్ట్‌బీర్ (దక్షిణాఫ్రికా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన ఆకర్షి కశ్యప్, అష్మిత చలియా కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఆకర్షి రెండో రౌండ్‌లో 21–9, 21–4తో హనా మొహమ్మద్ (ఈజిప్ట్)పై, అష్మిత 21–13, 14–21, 21–19తో థి ఫుంగ్ ట్రాన్ (వియత్నాం)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో రాహుల్ భరద్వాజ్, కార్తికేయ్ గుల్షన్ కుమార్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment