
కథానాయకిగా రెడీ
తమిళసినిమా: సినీరంగంలో వారసుల తెరంగేట్రం సులభం అని చెప్పనక్కర్లేదు. ఇలాచాలా మంది నటుడిగానో, నటిగానో, ఇతర శాఖల్లోనో పరిచయం అవుతూనే ఉన్నారు. ఆ కోవలో మరో వారసురాలు కథానాయకి అయ్యే ందుకు రెడీ అంటోంది. కలైపులి ఎస్.థాను నిర్మించి సంచలన విజయం సాధించిన యార్ చిత్రం దర్శక ద్వయంలో ఒకరు కన్నన్. ఆ చిత్రం తరువాత యార్ కన్నన్‌గా ముద్రవేసుకుని పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా మారి పలు చిత్రాల్లో న టిస్తున్న యార్‌కన్నన్, జీవా దంపతుల దత్తపుత్రిక గాయత్రి కథా నాయకిగా చిత్రరంగ ప్రవేశం చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న గాయత్రిని చూసిన వాళ్లు సినిమా నటిలాగుందే అన్న మాటలతో తానూ కథానాయకి కావా లన్న కోరిక గాయత్రికి బలంగా ఏర్పడిందట. అంతే తమిళచిత్ర పరిశ్రమలో స్టిల్స్‌రవిగా పేరు గాంచిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌తో ఫొటోషూట్ ఏర్పాటు చేయించుకుని వివిధ భంగిమల్లో ఫొటోలు దిగేసింది. ఆ ఫొటో చూసిన వారందరూ చాలా బాగున్నావనడంతో హీరో యిన్ కావాలనే నిర్ణయానికి వచ్చేసింది. విశేషం ఏమిటంటే స్టిల్స్ రవి ఫొటో షూట్ చేసిన పలువురు ప్రముఖ నటీమణులుగా రాణిస్తున్నారు. మంచి నిర్మాణ సంస్థ, మంచి టీం అమరితే కథానాయకిగా నటించడానికి తాను రెడీ అంటోంది ఈ పదహారేళ్ల పరువాల గాయత్రి.