
నటి గాయత్రి రఘురాంతో పాటు 150 మంది బీజేపీ కార్యకర్తలపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం కోయంబేడులోని అంబేడ్కర్ విగ్రహానికి వీసీకే, ఇతర పార్టీ నాయకులు నివాళులర్పించే సమయంలో బీజేపీకి చెందిన నటి గాయత్రి రఘురాం, 150 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో గాయత్రి రఘురాం వెట్రివేల్, వీరవేల్ అంటూ కుమారస్వామి పేరుతో నినాదాలు చేశారు.
దీంతో వీసీకే, ఇతర పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు నటి గాయత్రి రఘురాంతో పాటు 150 మందికి పైగా కార్యకర్తలపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేవిధంగా వీసీకే తదితర పార్టీలకు చెందిన 30 మందికి పైగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment