ఘనంగా గాయత్రి ఆలయ వార్షికోత్సవం
శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి వారల కల్యాణాన్ని వీక్షిస్తున్న మహిళలు
ముస్తాబాద్ : తెర్లుమద్దిలోని శ్రీగాయత్రిమాత ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. సముద్రాల శ్రీరామాచార్యులు, చక్రవర్తుల కృష్ణమాచారి, సముద్రాల శ్రీకాంత్‌చారి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్‌రావు, సర్పంచ్ ఈసరి కృష్ణ, సేవాలాల్‌తండా సర్పంచ్ మంగ్యానాయక్, ఎంపీటీసీ సుమలత, మాజీ సర్పంచులు కట్ట బాపురావు, మల్లెశ్‌యాదవ్, నాయకులు బాలమల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.