
యోగ్‌జకార్తా(ఇండోనేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి 19–21, 21–18, 21–17తో మిచెల్లి స్కోడ్‌స్ట్రప్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కాయ్ యాన్‌యాన్ (చైనా)తో గాయత్రి తలపడుతుంది.
పురుషుల సింగిల్స్‌లో కార్తికేయ్ గుల్షన్ కుమార్, లక్ష్య సేన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. నాలుగో రౌండ్‌లో కార్తికేయ్ 21–15, 21–12తో బ్రియాన్ యాంగ్ (కెనడా)పై, లక్ష్య సేన్ 21–16, 21–11తో లి షెఫెంగ్ (చైనా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో గారగ కృష్ణప్రసాద్–ధ్రువ్ కపిల ద్వయం 21–12, 21–16 తే యాంగ్ షిన్–చాన్ వాంగ్ (కొరియా) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment