
సాక్షి, విజయవాడ : తెలుగువారి ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడే చంద్రబాబు నాయుడికి అసలు ఆత్మగౌరవం ఉందా అని బీజేపీ అధికార ప్రతినిధి సీ గాయత్రి ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ విలువలతో స్థాపించిన టీడీపీకి చంద్రబాబు అంత్యక్రియలు నిర్వహించారన్నారు. అధికారం కోసం ఏ గడ్డి అయినా కరవటానికి చంద్రబాబు వెనకాడరని విమర్శించారు. అవినీతి టీడీపీ, కుంభకోణాల కాంగ్రెస్ ఒక్కటై మరల తెలుగు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకునే పనిలో నిమగ్నమయ్యాయని వ్యాఖ్యానించారు.
సింగపూర్ కంపెనీలకు రాజధానిని తాకట్టుపెట్టి, దేశంలో ఎమర్జన్సీ విధించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు తీరు ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని అన్న ఎన్‌టీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు అధికార దాహంతో తెలుగుదేశం వ్యవస్థాపకుడిని వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment