విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గల్లంతైన ముగ్గురి మృతదేహాలను బుధవారం ఉదయం వెలికితీశారు. విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందిన మల్లికార్జునరావు, కుమారి దంపతులతోపాటు వారి కుమార్తెలు ధరణశ్రీ(24), గాయత్రి (20), కుమారుడు అశోక్‌కుమార్, ధరణశ్రీ భర్త మూర్తి, వారి కుమారుడు కలసి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దారగంగమ్మ పండగకు మంగళవారం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాటిపూడి జలాశయం చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్నానం కోసి జలాశయంలో దిగిన ధరణశ్రీ, అశోక్‌కుమార్, గాయత్రి గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం మృతదేహాలను గుర్తించి వెలికితీశారు.
తాటిపూడి జలాశయంనుంచి మృతదేహాల వెలికితీత
Published Wed, May 25 2016 12:32 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement