
చాంపియన్ గాయత్రి
బెంగళూరు: యూనియన్ బ్యాంక్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి సత్తా చాటింది. అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి 13–21, 21–17, 21–14తో టాప్ సీడ్ ఆకర్షి కశ్యప్‌పై విజయం సాధించి టైటిల్‌ను దక్కించుకుంది.
డబుల్స్ విభాగంలో గాయత్రి జోడీకి నిరాశ ఎదురైంది. నగరానికే చెందిన సామియా ఇమాద్ ఫరూఖితో జతకట్టిన గాయత్రి రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–సామియా జోడీ 21–17, 17–21, 17–21తో బండి సాహితి–వర్షిణి జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో గాయత్రి– సామియా ద్వయం 21–17, 21–13తో జాహ్నవి–ఆర్య శెట్టి జంటపై గెలుపొందింది.