
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బలవంతంగా హాస్టల్‌ను ఖాళీ చేయించింది. యాజమాన్యం తీరుకు మనస్తాపానికి గురైన విద్యార్థిని ఐశ్వర్య షాద్‌నగర్ వచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: (తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!)
(నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్)