Dhanush Singing Song for Aishwarya at Party Video Viral - Sakshi
Sakshi News home page

Dhanush divorce: ఐశ్వర్య కోసం పాట పాడిన ధనుష్‌.. పాత వీడియో వైరల్‌

Published Tue, Jan 18 2022 7:44 PM | Last Updated on Tue, Jan 18 2022 8:04 PM

Dhanush Singing Song For Aishwarya At Party Goes Viral - Sakshi

Dhanush Singing Song For Aishwarya At A Party Goes Viral: స్టార్‌ హీరో ధనుష్‌- ఐశ్వర్యల విడాకుల అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్‌, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్‌ కపూల్‌.. విడాకులు తీసుకోవడం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో అభిమానులు  వీరిద్దరి క్యూట్‌ మూమెంట్స్‌ని గుర్తుచేసుకొంటున్నారు. గతంలో ఓ పార్టీలో హీరో ధనుష్‌ భార్య కోసం ఎంతో ప్రేమగా పాట పాడగా, భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఐశ్వర్య సిగ్గుపడుతుంది. 8నెలల క్రితం నాటిది ఈ వీడియో. తాజాగా ధనుష్‌-ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో మరోసారి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. 

ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ వార్త చాలా షాకింగ్‌గా ఉందని పలువురు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా ఓ సినిమా ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసి కనిపించారు. అంతలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement