
ఏషియన్ బైక్ రేస్‌కు ఐశ్వర్య పిస్సే ఎంపిక
ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ మరీ ముఖ్యంగా క్రీడల్లో పురుషులకు గట్టి పోటీనిస్తున్నారు.
తైవాన్‌లో జరుగనున్న మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొననున్న బెంగళూరు యువతి
బెంగళూరు : ఇటీవలి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ మరీ ముఖ్యంగా క్రీడల్లో పురుషులకు గట్టి పోటీనిస్తున్నారు. ఈ వారం తైవాన్‌లో జరుగనున్న ఏషియన్ మోటార్ బైక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనున్న బెంగళూరుకు చెందిన ఐశ్వర్య పిస్సే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ సాహస క్రీడలో ప్రతిభను కనబరచడం ద్వారా మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడమే ముఖ్యోద్దేశ్యమని ఐశ్వర్య చెబుతోంది. ఇటువంటి సాహస క్రీడల్లోనే కాకుండా మోడలింగ్, టీవీ రంగాల్లో కూడా రాణిస్తూ ఐశ్వర్య అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఓ కన్నడ ప్రైవేటు ఛానల్‌లో ప్రసారమవుతున్న ఓ ధారావాహికలో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఐశ్వర్య పలు రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది.
ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ జేకేఎస్ జ్యువెల్లర్స్ సంస్థ డెరైక్టర్ జయకిశోర్ ప్రసాద్ క్రీడల్లో ఐశ్వర్య ప్రతిభను గుర్తించడంతో పాటు తైవాన్‌లో జరుగనున్న ఏషియన్ మోటార్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఆమెకు అన్ని విధాలుగా సహకారమందించడానికి ముందుకు వచ్చారు. త్వరలో జరుగనున్న ఏషియా రోడ్ రేస్‌లో 125 సీసీ బైక్‌తో పాల్గొననున్న ఐశ్వర్యతో పాటు చెన్నైకి చెందిన శృతి నాగరాజన్ కూడా ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనున్నారు. దేశీయస్థారుు బైక్ రేసుల్లో పాల్గొనడానికి నిర్ణరుుంచుకున్న సమయంలో మహిళలు ఇటువంటి ర్యాలీలో రాణించడం అంత సులువు కాదని, ఇది నీకు సరిపోయే క్రీడ కాదని పలువురు నిరుత్సాహపరిచే మాటలన్నారని ఐశ్వర్య తెలిపారు .బైక్‌రేసుల్లో తనకు వస్తున్న అవార్డులు, ప్రశంసలతో తనను నిరుత్సాహపరచిన వారే తనను అభినందిస్తున్నారని ఐశ్వర్య తెలిపారు. రోడ్ రేసుల్లో అంతర్జాతీయ స్థారుు గుర్తింపు తెచ్చుకోవడంతో ఎఫ్‌ఎంఎస్‌సీఐ (ఫెడరేషన్ మోటార్ స్పోర్‌ట్స క్లబ్ ఆఫ్ ఇండియా) తమను తైవాన్‌లో జరుగనున్న రోడ్‌రేస్‌కు పంపిస్తున్నారని ఆమె తెలిపారు.
’దేశం తరపున ఇద్దరు మహిళలు తైవాన్‌లో జరుగనున్న అంతర్జాతీయ రేసులో పాల్గొంటుండడం నిజంగా దేశం మొత్తం గర్వించదగ్గ విషయం. భారతీయ రేసుల చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళలు అంతర్జాతీయ స్థారుు రేసుల్లో పాల్గొంటున్నారు. ఏషియా స్థారుులో అత్యంత వేగవంతమైన రేసర్లుగా తమను తాము ఆవిష్కరించుకొని తమ ప్రతిభను ప్రపంచ వ్యాప్తం చేసుకోవడానికి ఇద్దరు మహిళలకు ఇదో చక్కటి అవకాశం’.
- సుజిత్ కుమార్, ఎఫ్‌ఎంఎస్‌సీఐ అధ్యక్షుడు