ఒకప్పుడు సెలబ్రిటీలను ఆరాధించేవారు. పొగడ్తలే ఎక్కువగా వినిపించేవి.. విమర్శలు అంతగా ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా ముఖం పట్టుకుని తిట్టేంత సీన్ అయితే లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని తారలు ఏ పోస్ట్ పెట్టినా.. అక్కడే తిట్టేస్తున్నారు, నోటికొచ్చింది అనేస్తున్నారు. ఇలాంటి ఆన్‌లైన్ ట్రోలింగ్ బాధితురాల్లో బుల్లితెర నటి ఐశ్వర్య శర్మ ఒకరు.
నేను చనిపోవాలట
ఒకరైతే ఏకంగా ఆమెను చచ్చిపోమని కోరారు. దానికి ఐశ్వర్య.. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నేను మాత్రం.. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలనే కోరుకుంటున్నానని రిప్లై ఇచ్చింది. ఈ ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. 'ట్రోలింగ్ అనేది ఒక దినచర్యలా మారిపోయింది. ప్రతిరోజూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాను. నేను ఏ తప్పూ చేయలేదు అయినా అటువంటి కామెంట్స్ వస్తుంటే బాధగా ఉంటుంది. మరోవైపు నా అభిమానులు చాక్లెట్స్, పువ్వులు.. ఇలాంటి బహుమతులు పంపుతూ ఉంటారు. గిఫ్టులు తీసుకోవడంలో నాకే ఇబ్బందీ లేదు. కానీ ఏ కారణం లేకుండా నా కోసం ఖర్చు పెట్టొద్దని నా అభిప్రాయం. అందుకే వారిని బహుమతులు పంపొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.
బహుమతులు, విమర్శలు.. ఏదీ వద్దు
అయినా వాళ్లు వినరు.. కానీ ఓసారి గుర్తు చేయాలనుకున్నాను. ఓ వ్యక్తి దీన్ని కూడా తప్పుపట్టి నాపై విమర్శలు గుప్పించాడు. నేను కూడా ఒక మనిషినే.. నేనేదైనా తప్పు చేస్తే మీరు ఇష్టమొచ్చినట్లు తిట్టండి, ప్రశ్నించండి. కానీ ఏమీ చేయకపోయినా నన్ను అనరాని మాటలు అంటున్నారు. అదెందుకో అర్థం కావడం లేదు. నాకు ఎవరి బహుమతులు వద్దు, ఎవరి విమర్శలూ వద్దు. ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను చచ్చిపోతే వారికి మనశ్శాంతి వస్తుందా?
శాడిస్టులు..
ముందేమో తిడతారు.. నటులు ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతారు. అసలు మీకు దాని గురించి మాట్లాడే హక్కు లేదు. కొందరు శాడిస్టులు పక్కవాళ్లను మాటలతో హింసించి ఆనందం పొందుతారు. సెలబ్రిటీల జీవితం ఎంతో ఆకర్షణీయంగా బాగుంటుందనుకుంటారు. కానీ దాని వెనక వారు పడ్డ కష్టాలను ఎవరూ పట్టించుకోరు. ఒక ఆర్టిస్టుగా నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక నెగెటివ్ రోల్ చేస్తే నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాననుకుంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్?' అని ఆవేదన వ్యక్తం చేసింది నటి ఐశ్వర్య.
చదవండి: చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment