మూడవసారి తాతైన రజనీ | Rajinikanth Welcomes Third Grand Child With Daughter | Sakshi

మూడవసారి తాతైన రజనీ

May 8 2015 2:59 AM | Updated on Sep 3 2017 1:36 AM

మూడవసారి తాతైన రజనీ

మూడవసారి తాతైన రజనీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ మూడవసారి తాత అయ్యారు. రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మూడవసారి తాత అయ్యారు. రజనీకాంత్‌కు ఇద్దరు కూతుళ్లు అన్న విషయం తెలిసిందే. వాళ్లలో పెద్ద కూతురు ఐశ్వర్య నటుడు ధనుష్ అర్ధాంగి. వీరికి యాత్ర, లింగా అనే ఇద్దరు కొడుకులున్నారు. కాగా మరో కూతరు సౌందర్య. ఈమె వ్యాపారవేత్త అశ్విన్‌కుమార్‌ను 2010లో వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ నటించిన పడయప్పా, బాబా, చంద్రముఖి, విజయ్ నటించిన శివకాశి, విశాల్ చిత్రం సండైకోళి, తదితర చిత్రాలకు సౌందర్య గ్రాఫిక్స్ డిజైనర్‌గా పని చేశారు. రజనీ నటించిన కోచ్చడయాన్ చిత్రాన్ని దర్శకత్వం వహించారు.
 
 ఆ చిత్ర ఆడియో కార్యక్రమంలో సౌందర్య కుటుంబం పిల్లలపై దృష్టి సారించాలని రజనీకాంత్ హితవు పలికారు. కాగా ఆ తరువాత చిత్రాలకు దూరంగా వున్న సౌందర్య గర్భం దాల్చి బుధవారం రాత్రి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. నగరంలోని అపోలో ఆసుపత్రిలో సౌందర్య రాత్రి 10.30 నిమిషాలకు మగబిడ్డను కన్నారు. తన కూతురు మగబిడ్డకు జన్మించిన విషయం తెలిసి రజనీకాంత్ సంతోషంతో పొంగిపోయారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి మనవడిని చూసి ఆసుపత్రికి సిబ్బందికి స్వీట్స్ పంచి తన ఆనందాన్ని పంచుకున్నారు. చిత్ర ప్రముఖుల నుంచి రజనీకాంత్‌కు, సౌందర్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement