![దూడకు బారసాల](/styles/webp/s3/article_images/2017/09/2/61420275140_625x300.jpg.webp?itok=L197W7-L)
దూడకు బారసాల
మెదక్ : దూడ పుట్టి 21 రోజులు అయిన సందర్బంగా తొట్టేలో వేసి బారసాల కార్యక్రమానికి నిర్వహించాడు ఓ రైతు. జిన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేశ్ అనే రైతు వద్ద గేదెలున్నాయి. ఓ గేదెకు దూడ పుట్టడంతో ఆ రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. దీంతో 21 రోజుల పండుగను ఆయన ఘనంగా నిర్వహించారు.
తొట్టెలను పువ్వులతో ముస్తాబు చేసి... దూడను పడుకోబెట్టి బారసాల కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం కుటుంబసభ్యులు, స్నేహితులు సంబరాలను జరుపుకున్నారు. దూడకు ఐశ్వర్య అనే నామకరణం చేశారు.