
చక్కనమ్మ ఇలా చిక్కింది!
ఐశ్వర్య ఆహారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినరు.
ఫిట్‌నెస్
లో ఫ్యాట్.. హై ఫైబర్
ఐశ్వర్య ఆహారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ అస్సలు తినరు. జంక్ ఫుడ్‌ను డైనింగ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్, వేపుళ్లుకు చాలా దూరం. ఫైబర్ ఉన్న ఆహారాన్నే ఇష్టపడతారు. ఉడకబెట్టిన కూరగాయలు, తాజా పళ్లను తీసుకుంటారు. వంట చేయడమంటే వల్లమాలిన ప్రేమ ఐశ్వర్యకు. అందుకే తనకు కావల్సింది తనే వండుకుంటారు. బయటి ఫుడ్‌ను ఇష్టపడరు.
ఒకేసారి కపుడునిండా భోజనం చేయడం కన్నా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తింటుంటారు. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగుతారు. అలాగే డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి పళ్లరసాలు, పళ్లు తీసుకుంటుంటారు. ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం, తేనె కలిపిన గ్లాసుడు వేడినీళ్లు తాగుతారు.
పవర్ యోగా
వ్యాయామం విషయానికి వస్తే జిమ్‌లో గంటలు గంటల వర్కవుట్స్ కన్నా 45 నిమిషాల పవర్ యోగా పట్లే ఆమెకు మక్కువ ఎక్కువ. బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్‌తో వార్మప్ అవుతారు. క్రంచెస్, పుషప్స్, పులప్స్ వంటి తేలికపాటి ఎక్సర్‌సైజులు చేస్తారు. సూర్య నమస్కారాలతో యోగా మొదలుపెడతారు. ఇవీ ఐశ్వర్య బచన్ అందం, చందం, నాజూకుదనం వెనక ఉన్న రహస్యాలు!
ఐశ్వర్య రాయ్... పేరు వింటే చాలు పోతపోసిన అందం కనిపిస్తుంది. ఓ సన్నజాజి తీగ గుర్తొస్తుంది. అలాంటి ఐశ్వర్య బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. ఈ చక్కనమ్మ ఎప్పుడు చిక్కి మునుపటి రూపానికి వస్తుందా అని వెయ్యికళ్లతో వెయిట్ చేశారు. అన్నట్టుగానే అమాంతం బరువు తగ్గి కొత్త మెరుపుతో మిలమిలలాడింది ఈ వెండితెర వేలుపు! ఆ స్లిమ్‌నెస్... ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం..!