కొత్త చాప్టర్‌ స్టార్ట్‌ చేస్తున్నా | Director AL Vijay announces his marriage to Dr R Aishwarya | Sakshi
Sakshi News home page

కొత్త చాప్టర్‌ స్టార్ట్‌ చేస్తున్నా

Jun 30 2019 2:27 AM | Updated on Jun 30 2019 2:29 AM

Director AL Vijay announces his marriage to Dr R Aishwarya - Sakshi

తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యారు. డాక్టర్‌ ఐశ్వర్యాను జూలైలో వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించారాయన. ‘నాన్న, అభినేత్రి, లక్ష్మీ (ప్రభుదేవా డ్యాన్స్‌ మూవీ)’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఏఎల్‌ విజయ్‌ పరిచయమే. తాజాగా పెళ్లి విషయాన్ని స్వయంగా ప్రకటిస్తూ – ‘‘జీవితంలో ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కోలా ఉంటుంది. నా జీవితంలో ఆనందం, బాధ, సక్సెస్, ఫెయిల్యూర్‌ అన్నీ ఉన్నాయి. అన్ని సమయాల్లో నాకు తోడుగా నిలబడిన మీడియా ఫ్రెండ్స్‌ను నా ఫ్యామిలీలా భావించాను.

నా ప్రైవసీని, ఎమోషన్స్‌ను మీడియా వాళ్లు చాలా గౌరవించారు.  డాక్టర్‌ ఆర్‌.ఐశ్వర్యను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను అనే విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. జూలైలో కుటుంబ సభ్యుల మధ్య మా పెళ్లి వేడుక జరగనుంది. జీవితంలో కొత్త చాప్టర్‌ ప్రారంభించబోతున్నందుకు మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని విజయ్‌ తెలిపారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని, జూలై 11న పెళ్లి జరగబోతోందని సమాచారం. 2014లో నటి అమలా పాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విజయ్‌ 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement