![AR Rahman shares updates about his upcoming musical 99 Songs - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/14/ar-rehmann.jpg.webp?itok=BgQOzZMk)
రెహమాన్
రెహమాన్ తొలిసారి కథా రచయితగా, నిర్మాతగా మారిన చిత్రం ‘99 సాంగ్స్’. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎహన్ భట్, ఎడిల్సీ వర్గస్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను జూన్ 21న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందని రెహమాన్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘‘99 సాంగ్స్’ సినిమా మీద మీరు చూపిస్తున్న ఆసక్తి, ప్రేమ మమ్మల్ని విపరీతమైన ఆనందానికి గురి చేస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ పనులు ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment