ఏ.ఆర్. రెహ్మాన్ ఇంటిపై దాడి | A R Rahman’s place in Los Angeles vandalised | Sakshi
Sakshi News home page

ఏ.ఆర్. రెహ్మాన్ ఇంటిపై దాడి

Published Wed, May 21 2014 9:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

రెహ్మాన్ నివాసంపై దాడి అనంతరం ఇంటి గోడలపై పిచ్చిరాతలు రాసిన ఆగంతకులు

రెహ్మాన్ నివాసంపై దాడి అనంతరం ఇంటి గోడలపై పిచ్చిరాతలు రాసిన ఆగంతకులు

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ అమెరికాలోని ఇంటిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఆంగ్ల చిత్రం స్లమ్‌డాగ్ మిలియనర్ చిత్రానికి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఈ సంగీత మాంత్రికుడికి ఆ తరువాత వరుసగా హాలీవుడ్ చిత్రాల అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో ఏ.ఆర్.రెహ్మాన్, అమెరికాలో సొంతంగా నివాసం ఏర్పరచుకున్నారు.
 
అమెరికాలోని లాస్ ఏం జిల్స్‌లో అందమైన భవనం కట్టించుకున్నారు. అమెరికా వెళ్లినప్పుడల్లా ఆయన అక్కడే బస చేస్తారు. ఇప్పుడా ఇంటిపైన దుండగులు దాడికి పాల్పడి స్వల్పంగా ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఏ.ఆర్. రెహ్మాన్‌కు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎ.ఆర్. రెహ్మానే స్వయంగా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement