హ్యాట్రిక్‌ సాధిస్తారా? | Vijay-Atlee team up for hattrick movie | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ సాధిస్తారా?

Published Fri, Nov 16 2018 2:22 AM | Last Updated on Fri, Nov 16 2018 2:22 AM

Vijay-Atlee team up for hattrick movie - Sakshi

విజయ్‌

ఇటీవల ‘సర్కార్‌’ సినిమాతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు తమిళ నటుడు విజయ్‌. ఆయన నెక్ట్స్‌ అట్లీ దర్శకత్వంలో హీరోగా నటించనున్నారు. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. ఎజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఏఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. అట్లీ–విజయ్‌ కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన ‘తేరి (తెలుగులో ‘పోలీసోడు’), ‘మెర్సెల్‌’ (తెలుగులో ‘అదిరింది’) సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ సాధించాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్‌ హిట్‌పై కన్నేశారు. వచ్చే ఏడాది దీపావళికే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక చాన్స్‌ కోసం సమంత, కాజల్, సాయేషా, కీర్తీ సురేశ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో విజయ్‌ బాక్సింగ్‌ కోచ్‌ పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement