
ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు
చెన్నై : ఎవరి మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తనకు లేదని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ పేర్కోన్నారు. వివరాల్లోకెళితే ఆయన సంగీతాన్ని అందించిన ఇరానీ చిత్రం ముహ్మద్ ఇరైదూదర్ అన్న చిత్రం పెద్ద వివాదానికి తెర లేపింది. ఇస్లామ్ మతస్తులు చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతటితో ఆగలేదు. ఆ చిత్రం తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ ఆరోపించారు. ముహ్మద్ ఇరైదూదర్ చిత్రాన్ని భారత్ లో విడుదల చేయరాదంటూ వారు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఇస్లామ్ మతస్తుల మనోభావాలకు భంగం కలిగించే ఏ చిత్రాన్ని అయినా అడ్డుకుంటామని ముంబయికి చెందిన ప్రధాన మత గురువు మహ్మద్ అక్తార్ ప్రకటించారు.
అలా ముహ్మద్ ఇరైదూదర్ చిత్ర సమస్య తీవ్రరూపం దాల్చడంతో సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ ఎవరి మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. ముహ్మద్ ఇరైదూదర్ చిత్రానికి సంగీతాన్నే తాను అందించాను. ప్రేమాభిమానాలతోనే ఏదైనా సాధించగలమని తాను నమ్ముతాను. పగకు కారణమయ్యే విధంగా ఎలాంటి పదాలు ఉచ్చరించడారికి ఇష్టపడను అని ఏఆర్.రెహ్మాన్ వివరణ ఇచ్చారు.