‘#మీటూ ఉద్యమం’లో కొందరి పేర్లు విని షాకయ్యానంటున్నారు ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖుల మీద లైంగిక ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో రెహమాన్ ఇలా స్పందించారు. ఈ సందర్భంగా తాను మీటూ ఉద్యమానికి పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తన సోదరి మీటూ ఉద్యమం గురించి స్పందించిన కొద్దిసేపటికే రెహమాన్ తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘గత కొంత కాలంగా మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. బాధితులు.. నిందుతుల్లో కొందరి పేర్లు విన్నప్పుడు చాలా షాక్‌కు గురయ్యాను. మన పరిశ్రమ చాలా క్లీన్‌గా.. మహిళలను గౌరవించే విధంగా మారాలని ఆశిస్తున్నాను. ధైర్యంగా ముందుకు వచ్చిన బాధితులందరికి తగిన శక్తి సమకూరాలని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా వల్ల బాధితులు తమకు జరిగిన అన్యాయాల గురించి స్వేచ్ఛగా మాట్లాగల్గుతున్నారు. ఇది చాలా మంచి విషయం. కానీ ఇంటర్నెట్‌లో న్యాయం, అన్యాయాల గురించి మాట్లాడేటప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే దీన్ని కొందరు తప్పుడు ప్రయోజనాలు కోసం కూడా వాడే అవకాశం ఉంది’ అని ట్వీట్ చేశారు.
— A.R.Rahman (@arrahman) October 22, 2018
Comments
Please login to add a commentAdd a comment