
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా వైజాగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. దీనికి సంబంధించిన రామ్ చరణ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే ఈ సినిమా తర్వాత చెర్రీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.



















