చిరు కోసం ఆస్కార్ విన్నర్..! | A R Rahman Composing Music For Chiranjeevi Uyyalawada Narasimaha Reddy | Sakshi
Sakshi News home page

చిరు కోసం ఆస్కార్ విన్నర్..!

Published Tue, Jun 20 2017 10:26 AM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

A R Rahman Composing Music For Chiranjeevi Uyyalawada Narasimaha Reddy

ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు మెగా టీం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.

మెగాస్టార్ సరనస బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దేశభక్తి సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఒప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బాహుబలి గ్రాఫిక్స్ టీంతో గ్రాఫిక్స్ చేయించే ప్లాన్లో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement