విడిపోయినా భర్తతో కలిసే విహారయాత్ర.. నటి ఏమందంటే? | Charu Asopa on Holidaying with Ex Husband Rajeev Sen | Sakshi
Sakshi News home page

Charu Asopa: విడిపోయినంత మాత్రాన బంధాలన్నీ తెగిపోయినట్లేనా? తనతో సంతోషంగా ఉన్నా..

Published Fri, Jul 19 2024 4:34 PM | Last Updated on Fri, Jul 19 2024 5:28 PM

Charu Asopa on Holidaying with Ex Husband Rajeev Sen

భార్యాభర్తలుగా విడిపోయినా తల్లిదండ్రులుగా కలిసే ఉన్నామంటోందో బాలీవుడ్‌ మాజీ జంట. కూతురి కంటే ఏదీ ఎక్కువ కాదంటున్నారు. వారే బుల్లితెర నటి చారు అసోపా.. హీరోయిన్‌ సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌. చారు-రాజీవ్‌ 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో జియానా అనే కూతురు పుట్టింది. ఆ మరుసటి ఏడాది ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించారు. గతేడాది విడాకులు తీసుకున్నారు.

దూరంగా ఎందుకు పెడతాను?
విడిపోయారన్న మాటే కానీ తరచూ కలుసుకుంటూనే ఉన్నారు. కూతురితో కలిసి హాలీడే ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్యే దుబాయ్‌కు వెళ్లొచ్చారు. దాని గురించి చారు మాట్లాడుతూ.. 'మా ట్రిప్‌ అద్భుతంగా జరిగింది. జియానా చాలా సంతోషపడిపోయింది. కుటుంబమంతా కలిసి ట్రిప్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి! రాజీవ్‌.. జియానా తండ్రి. అలాంటప్పుడు నా కూతురికి అతడి కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచుతాను? అందుకే అందరం కలిసే వెళ్లాం. 

అన్నీ మర్చిపోయి
రాజీవ్‌ అమ్మ సుష్మిత అంటే కూడా నాకిష్టం. రాజీవ్‌తోనూ హ్యాపీగా ఉన్నాను. విడిపోయినంతమాత్రాన మా బంధాలన్నీ తెగిపోయినట్లు కాదు. జియానాను తన కుటుంబానికి దూరంగా ఉంచాలనుకోవడం లేదు. రాజీవ్‌, నేను మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నాం. జియానా ముందు పాత విషయాలన్నీ మర్చిపోయి స్నేహితులుగా కొనసాగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకేముంటుంది?' అని చెప్పుకొచ్చింది.

చదవండి: లవ్యూ బేబి అంటూ పందిట్లో కన్నీళ్లు.. రెండునెలలకే అడ్డంగా దొరికిన హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement