లవ్యూ బేబి అంటూ పందిట్లో కన్నీళ్లు.. రెండునెలలకే అడ్డంగా దొరికిన హీరో | Celebrity Wedding Filmmaker Vishal Punjabi Recalled Bollywood Star Was Caught Cheating On His Wife 2 Months After Their Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లయిన రెండు నెలలకే బయటపడ్డ హీరో ఎఫైర్‌, ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉంది!

Published Fri, Jul 19 2024 2:12 PM | Last Updated on Fri, Jul 19 2024 3:05 PM

Celebrity Wedding Filmmaker Vishal Punjabi Recalled Bollywood Star Was Caught Cheating On His Wife 2 Months After Their Wedding

విశాల్‌ పంజాబి.. సెలబ్రిటీల పెళ్లిళ్లను మరింత అందంగా మలుస్తుంటాడు. పెళ్లి వేడుకలను జీవితాంతం తనివితీరా చూసుకునేలా అద్భుతంగా కెమెరాలో బంధిస్తుంటాడు. ఈయన సెలబ్రిటీ వెడ్డింగ్‌ ఫిలింమేకర్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విశాల్‌ తన కెరీర్‌లో ఎదురైన ఓ విచిత్ర సంఘటనను వెల్లడించాడు. 'ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరో పెళ్లికి నేను పని చేశాను. పెళ్లయిన రెండు నెలలకే అతడు చేసిన మోసం బయటపడింది.

ఒంటి మీద దుస్తుల్లేకుండా
సినిమా సెట్‌లోని మేకప్‌ వ్యాన్‌లో ఓ బాలీవుడ్‌ నటితో సరసాలాడుతున్న హీరోను అతడి భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అప్పుడతడు ఒంటి మీద దుస్తుల్లేకుండా ఉన్నాడు. వ్యవహారం పెద్దది కావడంతో.. పెళ్లి వీడియో నాకక్కర్లేదు అని నా ముఖం మీదే చెప్పేసింది. ఆ హీరోకు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. అతడి మేనేజర్‌కు ఫోన్‌ చేస్తే పెళ్లి వీడియో అవసరం లేదనేశాడు. కానీ ఆ వీడియో నేనేం చేసుకోవాలి? నెట్‌ఫ్లిక్స్‌కు అమ్మేయాలా? అని అడిగాను. 

పెళ్లి వీడియో వద్దన్నారు
నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా పూర్తిగా ఇవ్వనేలేదు. అప్పటివరకు 50% అడ్వాన్స్‌ తీసుకుని పనయ్యాక మిగతాది తీసుకునేవాడిని. వీళ్ల దెబ్బకు మొత్తం డబ్బు ఇచ్చాకే పందిట్లో అడుగుపెడుతున్నాను. వాళ్ల పెళ్లి వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది. అందులో హీరో ఐ లవ్యూ బేబీ అంటూ ఎమోషనలయ్యాడు. అవన్నీ మొసలి కన్నీళ్లు. ఆ బాలీవుడ్‌ హీరో పేరు బయటపెట్టలేను కానీ ఆ వీడియోతో లక్షలు సంపాదించొచ్చు. అయినా నేనా పని చేయలేదు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: కట్నం ఇచ్చి మరీ పెళ్లి.. అతడు డబ్బు తీసుకుని వెళ్లిపోతే?: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement