Piyush
-
పీయూష్, ఆమ్ కా పన్నా, జల్‌జీరాతో కడుపు చల్లగా..
మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో వేసవిలో ‘పీయూష్’ అనే పానీయాన్ని విరివిగా తాగుతారు. దాదాపు దీని తయారీ లస్సీ మాదిరిగానే ఉంటుంది. బాగా చిలికిన పెరుగులో పంచదారతో పాటు శ్రీఖండ్ అనే సంప్రదాయ మిఠాయిని, జాజికాయ పొడి, ఏలకుల పొడి వంటివి చేర్చడం వల్ల దీనికొక విలక్షణమైన రుచి ఏర్పడుతుంది. ‘పీయూషం’ అంటే అమృతం అనే అర్థం ఉంది. ‘పీయూష్’ పానీయం అమృతసమానంగా ఉంటుందని మరాఠీ, గుజరాతీ ప్రజలు చెబుతారు. చదవండి: Health Tips: ఇవి తింటే బీపీ అదుపులో ఉంటుంది! ఉత్తరాది రాష్ట్రాల్లో జల్జీరా, ఆమ్ కా పన్నా, ఖస్‌ఖస్, రూహ్ అఫ్జా వంటి సంప్రదాయ పానీయాలను వేసవిలో విరివిగా వినియోగిస్తారు. జీలకర్ర, మిరియాలు వంటివి కలిపి తయారుచేసే జల్జీరాను సాధారణంగా భోజనానికి ముందు సేవిస్తారు. దీనివల్ల అలసట తీరి, ఆకలి పుడుతుందని, జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతారు. పచ్చి మామిడికాయలతో తయారుచేసే ఆమ్ కా పన్నా, వట్టివేళ్లు, గసగసాలు కలిపి తయారుచేసే ఖస్‌ఖస్ పానీయాలను కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా సేవిస్తారు. గులాబీరేకుల కషాయానికి చక్కెర పాకాన్ని జోడించి తయారు చేసే ‘రూహ్ అఫ్జా’తో నేరుగా షర్బత్ తయారు చేసుకోవడమే కాకుండా, దీనిని లస్సీ, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌ల వంటి వాటిలోనూ అదనపు రుచికోసం ఉపయోగిస్తారు. ఘజియాబాద్‌కు చెందిన హఫీజ్ అబ్దుల్ మజీద్ అనే యునాని వైద్యుడు శతాబ్ది కిందట రూపొందించిన ‘రూఫ్ అఫ్జా’ భారత ఉపఖండమంతటా విరివిగా వినియోగంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో చందనం పొడి, కుంకుమపువ్వు, పంచదార, నిమ్మరసం కలిపి తయారు చేసే చందన షర్బత్‌ను కూడా వేసవి పానీయంగా సేవిస్తారు. ఇవన్నీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, వేసవితాపాన్ని తీర్చడంలో బాగా దోహదపడతాయి. ఈ వేసవిలో మీరూ వీటి రుచులను ఆస్వాదించండి. -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్‌పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
393 సహాయక శిబిరాలు..21,025 మందికి వసతి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో పనుల్లేక చిక్కుకుపోయిన వలస కూలీలకు వసతి ఏర్పాట్లలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రోల్ మోడల్‌గా నిలుస్తోంది. రాష్ట్రానికి చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వారికి కూడా జిల్లాల వారి గా ఎక్కడికక్కడ సహాయక శిబిరాలు ఏర్పాటుచేసి వారందరికీ పౌష్టికాహారం అందిస్తోంది. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 393 సహాయక శిబిరాలను ఏర్పాటుచేసి మొత్తం 21,025 మందికి వసతి ఏర్పాట్లు కల్పించినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్ కమిషనర్, సహాయక శిబిరాల నోడల్ ఆఫీసర్ పీయూష్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో 12,820 మంది ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు పనుల మీద వచ్చి చిక్కుపోయిన వారు ఉండగా, ఇతర రాష్ట్రాల వారు 8,205 మంది ఉన్నట్లు తెలిపా రు. మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఈ శిబిరాల్లో ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 1,334, తమిళనాడు 1,198, జార్ఖండ్ 918, బిహార్ 735 మంది ఉన్నారు. కాగా, రాష్ట్రంలో తమిళనాడు ప్రజలకు చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తంచేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలోనే 106 శిబిరాలు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 393 సహాయక శిబిరాలు ఏర్పాటుచేస్తే అందులో ఒక్క కృష్ణాజిల్లాలోనే 106 శిబిరాలు ఏర్పాటుచేశారు. ఇక్కడ అత్యధికంగా 7,061 మంది ఉన్నారు. అత్యల్పంగా వైఎస్సార్ జిల్లాలో నాలుగు శిబిరాలు ఏర్పాటుచేశారు. ఈ శిబిరాల్లో భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటుచేశామని, అలాగే అల్పాహారం, భోజనంతోపాటు ఉడకపెట్టిన కోడిగుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు పీయూష్‌కుమార్ వివరించారు. ఈ శిబిరాలను నిరంతరాయంగా పర్యవేక్షించడానికి అధికారులను నియమించామని.. వీరికి 49,758 మంది సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం ప్రభుత్వమే కాకుండా 95 ఎన్జీవో సంస్థలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. ఈ శిబిరాల్లో ఉండే వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీయూష్‌కుమార్ తెలిపారు. -
జీఎస్టీ పరిహారం..ఎన్నాళ్లీ జాప్యం?
సాక్షి, అమరావతి: జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్) పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక మందగమనం వల్ల ఆదాయాలు తగ్గి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు కేంద్రం చర్య ఆందోళన కలిగిస్తోంది. జీఎస్టీ పరిహారంగా ఈ ఏడాది ఏప్రిల్–అక్టోబర్ మధ్యకాలంలో రాష్ట్రానికి రూ.1,966.33 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 529 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.1,437.33 కోట్ల పరిహారం కేంద్రం నుంచి రావాలి. జీఎస్టీ వసూళ్లు భారీగా పడిపోవడంతో పరిహారం సకాలంలో చెల్లించలేకపోతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయం తగ్గితే కేంద్రం చెల్లించాల్సిందే జీఎస్టీ అమలు చేసినప్పుడు రాష్ట్రాల ఆదాయం తగ్గితే దాన్ని పరిహారం రూపంలో చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందుకు 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ఆధారంగా తీసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం ఆదాయం కంటే 14 శాతం వృద్ధి లేకపోతే.. ఎంత మేర తగ్గితే ఆ మొత్తాన్ని పరిహారంగా కేంద్రం చెల్లిస్తుంది. జీఎస్టీ అమలు సంవత్సరంలో మన రాష్ట్రానికి 2017–18 సంవత్సరానికి కనీస ఆదాయం లక్ష్యాన్ని నెలకు రూ.1,502.48 కోట్లుగా నిర్ధారించారు. ఇప్పుడు 2019–20 సంవత్సరానికి కనీస ఆదాయ మొత్తం నెలకు రూ.1,952.62 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈ ఏడాది మొదటి ఏడు నెలల కాలానికి రాష్ట్రానికి రూ.13,668.35 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.11,702.02 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఈ ఏడు నెలలకు కేంద్రం రాష్ట్రానికి జీఎస్టీ పరిహారంగా రూ.1,966.33 కోట్లు చెల్లించాలి. జాప్యంపై వివిధ రాష్ట్రాల ఆందోళన జీఎస్టీ పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యంపై పలు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఆర్థిక మందగమనంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఆ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వాపోయారు. జీఎస్టీ పరిహారంగా రాజస్థాన్‌కు రూ.4,400 కోట్లు, ఢిల్లీకి రూ.2,355 కోట్లు, పంజాబ్‌కు రూ.2,100 కోట్లు, కేరళకు రూ.1,600 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది నెలాఖరులోగా చెల్లిస్తామన్నారు ఈ ఏడు నెలల కాలానికిగాను రూ.1,437.33 కోట్ల పరిహారం చెల్లింపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. నెలాఖరులోగా చెల్లిస్తామని కేంద్రం నుంచి హామీ వచ్చింది. ఇది కాకుండా డిసెంబర్ నాటికి మరో రూ.500 కోట్లు పరిహారం కోరాల్సి ఉంటుంది. - పీయూష్ కుమార్, రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ చీఫ్ కమిషనర్ -
కోకిల గీతం... తుమ్మెద రాగం
‘అన్వేషణ’ సినిమాలో భానుప్రియ, కార్తీక్ లాంటివాళ్లు.. అక్షిత, పీయూష్! ఆ సినిమాలో భానుప్రియ చెట్టూ పుట్టా తిరిగి శ్రావ్యమైన శబ్దాలను అన్వేషిస్తూ ఉంటే, కార్తీక్ ఆమెకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడా అంతే. అక్షితకు ఆమె భర్త పీయూష్ పరిశోధన సహకారం అందిస్తున్నారు. ఈ దంపతులకు వినాయక్ అనే మరో ప్రకృతి ప్రేమికుడు కూడా తోడయ్యాక.. అంతరించిపోతున్న గిరిజన గీతాలన్నీ ఒకటొకటిగా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. భారతదేశంలో కొన్ని వేల గిరిజన జాతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలు, వేషధారణ, సంగీతం అన్నీ వేటికవే ప్రత్యేకం. అటువంటి జాతులలో కొన్ని జాతులు రానురాను అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో ఒకరు జాగ్రత్త చేయకపోతే, కొంతకాలానికి ఈ జాతుల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పీయూష్ గోస్వామి, అక్షిత దంపతులు ‘ది పార్గాటెన్ సాంగ్స్’ అనే ఒక ప్రణాళిక రూపొందించారు! బియాట్ పాట ‘బీట్’ ఆగింది! పీయూష్, అక్షిత దంపతులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలా ఒకసారి అస్సాంలోని డిమో హసావ్ జిల్లాను సందర్శించారు. అక్కడ ‘ఎపా లల్లురా’ అనే బియాట్ గిరిజన తెగ నాయకుడిని కలిశారు.ఆయనతో మాట్లాడుతూండగా ఆ తెగ వారి సంగీతం కాలగర్భంలో కలిసిపోతోందన్న బాధ ఆ నాయకుడి ముఖంలో కనిపించింది. వారు బియాట్ భాషతో పాటుగా యాసతో కూడిన హిందీ, బెంగాలీ, అస్సామీ, థింసా భాషలు, నాగాలాండ్‌లోని మాండలికాలు మాట్లాడగలరని లల్లూరా మాటల నుంచి తెలుసుకున్నారు. వారి భాష కేవలం మౌఖికంగా మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. వారిలోని కొత్తతరానికి.. బియాట్ భాష రాకపోవడం వల్ల సంప్రదాయ సంగీతానికి కాలం చెల్లుతోందని ఈ దంపతులకు లల్లూరా చెప్పారు. బియాట్ జాతి వారు ఈశాన్య భారతంలో ఉంటారు. వీరు చైనా నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లుగా భావిస్తారు. అక్కడ వారు మైనారిటీలే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. ఈ విషయం గోస్వామి దంపతులను కదిలించింది. వీరు అప్పటికే ‘రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ’ (ఈ ఊరు, ఈ నేల) అనే ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. లల్లూరా మాటలు విన్నాక ‘‘ఏదో ఒకటి చేద్దాం’’ అన్నారు గోస్వామి. ఎక్కడ దొరికితే అక్కడ 2018 లో ఈ దంపతులు గిరిజన సంప్రదాయ గీతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడ బియాట్ పాటలు దొరికితే అక్కడ, ఎవరు పాడుతుంటే వారివి అక్కడికక్కడే రికార్డు చేయడం మొదలుపెట్టారు.ఈ జాతి వారికి సంబంధించి తాము సేకరించినవాటిని ఒక డాక్యుమెంటరీ సినిమాగా రూపొందించారు. ‘ద ఫర్గాటెన్ సాంగ్స్’ అని పేరు పెట్టి ఈ ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేశారు. గోస్వామి దంపతులతో గ్రామీణ కళాకారులు చాలామంది ప్రయాణిస్తున్నారు. దారిలో వారు వింటున్న కొత్త కొత్త శబ్దాలను, కథలను రికార్డు చేస్తూ, పాటలకు జోడిస్తున్నారు. అలాగే ఆయా జాతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. గిరిజనుల జానపదాలను షార్ట్ ఫిల్మ్‌లుగా తీసి, ఆడియో రిలీజ్లు కూడా పెడుతున్నారు. సంగీత శంఖంలో కథల తీర్థం చెన్నైలో నివసిస్తున్న వినాయక్ అనే మరో యువకుడు గోస్వామి దంపతులతో కలిసి, వారు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా నడుపుతున్నారు. ప్రకృతిలో ఉండే శబ్దాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి, జానపదులకు సంబంధించిన కథలను సంగీతం ద్వారా చెబితే అందరికీ త్వరగా చేరుతుందని, సమాజంలో అందరికీ అవేర్నెస్ కలుగుతుందని భావించాడు వినాయక్. బియాట్ తర్వాత.. బోండా, బస్తర్ కనుమరుగైపోతున్న సంస్కృతిని కాపాడటం కోసం లల్లూరా పాడుతున్న పాటలను ఒకచోట పొందుపరచడం కోసం గోస్వామి, వినాయక్‌లు అడవుల్లో అడుగులు వేస్తున్నారు. భయంకరమైన రోడ్ల మీద ప్రేమగా ప్రయాణిస్తున్నారు. వినాయక్‌కి వారి గురించిన విశేషాలు అర్థమయ్యాక, పాటలు, వివిధ శబ్దాలను సేకరించారు. అనేకమంది గాయకులను కలుసుకుంటున్నారు. బియాట్ సంప్రదాయ గీతాలను ఎపా లల్లూరా, ఎపా రొయిలియానాలు పాడుతుండగా వినాయక్ రికార్డు చేస్తున్నారు. ఇక్కడ పని పూర్తయ్యాక, ఒరిస్సాకు చెందిన బోండా జాతివారి గురించి, బస్తర్‌లో ఉన్న గోండు జాతి గురించి పరిశోధన చేయనున్నారు. – జయంతి -
ఈ మత్తు లోకల్!
- ఎల్ఎస్డీ తరహాలో డ్రగ్‌ను తయారు చేసిన పీయూష్ అనే యువకుడు - నగరంలో వెలుగులోకి వచ్చిన కొత్త మత్తు దందా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్త ‘లోకల్’ డ్రగ్బయటపడింది.. ఎల్ఎస్డీ తరహాలో ఇక్కడే తయారు చేసిన కొత్త మత్తు పదార్థం వెలుగు చూసింది. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన పీయూష్ అనే యువకుడు.. వయాగ్రా, గంజాయి, యాంటీ డిప్రెషన్ మందులు, నిద్ర మాత్రలు కలిపి ఈ డ్రగ్‌ను రూపొందించాడు. తన మీద తానే ప్రయోగాలు చేసుకుంటూ దానిని ఎల్ఎస్డీ తరహాలో తయారు చేశాడు. దానికంటే తక్కువ ధరలో వందల మంది యువతకు సరఫరా చేస్తున్నాడు. ఎక్సైజ్ యాంటీ నార్కోటిక్ టీమ్ అధికారులు ఈ దందాను ఛేదించి.. పీయూష్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి ‘లోకల్’ఎల్ఎస్డీని, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎక్సైజ్ డీసీ వివేకానందరెడ్డి, టీమ్ లీడర్ అంజిరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దుతో.. హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పీయూష్ 2010లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం జంటాక్ కంపెనీలో ఉద్యోగంలో చేశాడు. తర్వాత ఓ ప్రైవేటు కంపెనీలో చేరాడు. కానీ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆ కంపెనీ కొందరు ఉద్యోగులను తొలగించింది. వారిలో పీయూష్ కూడా ఉన్నాడు. అయితే ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే గంజాయి అలవాటున్న పీయూష్‌కు.. ఓ రేవ్‌పార్టీలో ఎల్ఎస్డీ డ్రగ్ పరిచయమైంది. ఉద్యోగం పోయిన బాధలో పూర్తిగా ఆ డ్రగ్‌కు బానిసయ్యాడు. దానికి వేల రూపాయలు ఖర్చు చేయలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తి... డ్రగ్స్ సరఫరా దారుడిగా మారాడు. డార్క్‌నెట్ ద్వారా విదేశాల నుంచి ఎల్ఎస్డీ డ్రగ్స్ తెప్పించి అమ్మాడు. ఆ డ్రగ్ ఖరీదు ఎక్కువగా ఉండడంతో తానే డ్రగ్ తయారు చేశాడు. ఎలా చేశాడంటే..? స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌పై మంచి పట్టున్న పీయూష్ నార్కోటిక్ డ్రగ్స్, వాటి స్వభావంపై దాదాపు రెండు నెలల పాటు ఇంటర్నెట్లో శోధించాడు. ఎల్ఎస్డీకి కావాల్సిన ముడి పదార్థాలు, మోతాదులు, ఆ డ్రగ్‌ను తీసుకున్న వ్యక్తి మానసిక పరిస్థితి తదితర అంశాలపై అధ్యయనం చేశాడు. ఆయా ముడి పదార్థాలను సేకరించి డ్రగ్ తయారు చేశాడు. తనపైనే ప్రయోగాలు చేసుకుని.. పనిచేస్తోందని నిర్ధారించుకున్నాడు. నెదర్లాండ్స్ నుంచి కొరియర్ సర్వీస్ ద్వారా బ్లాటింగ్ పేపర్లు తెప్పించాడు. తాను తయారు చేసిన రసాయనాన్ని బ్లాటింగ్ పేపర్‌పై వేసి.. దానిపై వృత్తాకారాలను ముద్రించాడు. ఒక్కొక్క ‘లోకల్’డ్రగ్ స్లిప్‌ను రూ.800 నుంచి రూ.1000 చొప్పునæ విక్రయించాడు. తక్కువ ధరకే డ్రగ్ దొరకటంతో ఎక్కువ మంది యువత దానివైపు మళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్నవి ► 2,746 స్ట్రిప్పుల కెమికల్ కోటెడ్ ఎస్ఎస్డీ ► 20 గ్రాముల గంజాయి ► 40 గ్రాముల తెలుపు రంగులోని పొడి ► 4 వెన్లార్ –ఆర్ఎక్స్ 75 ఎంజీ టాబ్లెట్లు ► 5 వెన్లార్ –ఆర్ఎక్స్ 150 ఎంజీ టాబ్లెట్లు ఒక ల్యాప్‌టాప్ -
చిన్ని గుండె ఆగిపోయింది..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : విధికి కన్ను కుట్టింది.. ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ బాలుడి జీవితాన్ని అర్ధంతరంగా తుంచేసింది.. ఆదుకుంటామని దాతలు ముందుకొస్తున్నా దయలేని మృత్యువు తొందరపడింది.. హద్రోగ సమస్యతో బాధ పడుతున్న పియూష్‌కుమార్ గురించి ‘చిన్ని గుండెకు ఎంత కష్టం!’ శీర్షికన సాక్షిలో గత నెల 26న కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఆ చిన్నారికి సాయపడేందుకు దాతలెందరో ముందుకువచ్చారు. ఉన్నత వైద్యం అందించేలోపే పరిస్థితి విషమించి ఆ బాలుడు శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మర్రిపాలెం ప్రాంతానికి చెందిన జి.పద్మావతి భర్త భిలాయ్‌లోని మహేంద్రటెక్లో పనిచేసేవారు. వారికి బాబు పీయూష్ కుమార్, పాప భార్గవి ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో భర్త మరణించారు. దీంతో పద్మావతి పిల్లలతో సహా విశాఖలో చెల్లెలు ఇంటికి వచ్చేశారు. ఆర్నెల్ల క్రితం పీయూష్‌కు కడుపునొప్పి రావడంతో ఓ వైద్యుడిని సంప్రదించగా ఆయన హృద్రోగ నిపుణుడిని కలవాలని సూచించారు. కేజీహెచ్‌లో పరీక్షించిన డాక్టర్లు బాబు గుండె మూడింతలైందని, రక్తప్రసరణ కష్టమవుతోందని చెప్పారు. బాబు బతకాలంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తల్లి కన్నీరుమున్నీరయింది. ఈ బాలుడి కన్నీటి కథ సాక్షిలో ప్రచురితమైంది. ఆపన్న హస్తం అందేలోగానే.. గురువారం రాత్రి 11 గంటల ప్రాం తంలో బాబుకి తీవ్రంగా కాళ్లు నొప్పు లు వచ్చాయి. ఎప్పుడూ వస్తున్న నొప్పు లే కదా..అని టాయిలెట్ పోయించి పడుకోబెట్టారు. కాళ్ల నొప్పుల తీవ్రత మరింతగా ఉండడంతో శుక్రవారం వేకువజాము 4 గంటల సమయంలో కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాబుని పరీక్షించి అర్జెంట్‌గా స్కానింగ్ తీయించాలని, కేజీహెచ్‌లో లేదని కేర్ ఆస్పత్రిలో స్కానింగ్ తీయించి తీసుకురమ్మన్నారు. అక్కడకు తీసుకువెళ్లగా వేకువజామున స్కానింగ్ సిబ్బంది లేరు. వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తుండగా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాబు పరిస్థితి విషమించడంతో తల్లి అనుమతి మేరకు అక్కడి వైద్యులు కరెంట్ స్ట్రోక్ ఇచ్చారు. పరిస్థితి మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బాబు చనిపోయినట్టు వైద్యులు నిర్థారించారు. పీయూష్ కుమార్ చదువుతున్న స్టెల్లా మేరీస్ స్కూల్ యాజమాన్యం మరణ వార్త తెలుసుకొని బాబు ఇంటికి వచ్చి నివాళులర్పించారు. శనివారం స్కూల్‌కి సెలవు ప్రకటించినట్టు బాబు తల్లి పద్మావతి సాక్షికి తెలిపారు. -
చిన్ని గుండెకు ఎంత కష్టం!
► గుండె పెరుగుదలతో బాధపడుతున్న పీయూష్ ► గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరి ► రూ.30 లక్షలు ఖర్చవుతాయన్న వైద్యులు ► దాతల సహకారం కోరుతున్న బాబు తల్లి డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలుడికి పెద్ద కష్టం వచ్చింది. పదేళ్ల పీయూష్‌కు చిన్ని గుండె మోయలేని భారవైుంది. బాబు గుండె పెరిగిందని, గుండె మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. భర్త మరణంతో కుంగిన బాబు తల్లి జి.పద్మావతి తన బిడ్డను కాపాడాలంటూ దాతల సహకారం కోరుతోంది. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శని వారం ఆమె విలేకరుల సమావే శంలో తన ఆవేదన తెలిపింది. పద్మావతి భర్త భిలాయ్‌లోని మహేంద్రటెక్లో పని చేసేవారు. వారికి బాబు పీయూష్ కుమార్, పాప భార్గవి ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో భర్త మరణించారు. ఆదరించాల్సిన అత్తామామలు అక్కడి నుంచి పంపించేయడంతో పద్మావతి పిల్లలతో సహా విశాఖలో చెల్లెలు ఇంటికి వచ్చేశారు. పీయూష్‌ను సమీపంలోని పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. ఆర్నెల్ల క్రితం పీయూష్‌కు కడుపునొప్పి రావడంతో ఓ వైద్యుడిని సంప్రదించగా ఆయన హృద్రోగ నిపుణుడిని కలవాలని సూచించారు. కేజీహెచ్‌లో పరీక్షించిన డాక్టర్లు బాబు గుండె మూడింతలైందని, రక్తప్రసరణ కష్టమవుతోందని చెప్పారు. బాబు బతకాలంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన వద్ద ఉన్న కొద్ది సొమ్మును వైద్యానికే ఖర్చు చేశానని, దికు్కతోచని స్థితిలో దాతల సహకారం కోరుతున్నానని చెప్పారు. సాయం చేయాలనుకునేవారు జి.పద్మావతి, అకౌంట్ నంబరు 20324336 423, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మర్రిపాలెం శాఖ, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐ/015 630కు జమ చేయవచ్చని లేదా 75873 29589, 79976 37887 నంబర్లలో సంప్రదించి సాయం చేయవచ్చని కోరుతున్నారు. -
బకెట్ వాషింగ్ మెషీన్..
వాషింగ్ మెషీన్.. ఇది లేకుండా చాలా మందికి ఇళ్లలో నడవదు.. అదే సమయంలో మరికొందరికి ఇది అవసరమైనా.. ధర వల్ల కొనుక్కునే పరిస్థితీ లేదు. ఈ అంతరాన్ని పూర్తించే పనిలో పడ్డారు ముంబైకి చెందిన వింబస్ నవరచన సంస్థకు చెందిన పీయూష్ అగర్వాలా. దాని ఫలితమే ఈ వీనస్ వాషింగ్ మెషీన్. మన వద్ద 25 లీటర్ల బకెట్.. వీనస్ యంత్రం ఉంటే చాలు.. ఎంచక్కా బట్టలు ఉతికేసుకోవచ్చు. ఒక ట్రిప్పులో 3 జతల వరకూ ఉతుకుతుంది. బకెట్లో నీళ్లు పోసి.. డిటర్జెంట్ వేసి.. దానికి వీనస్‌ను క్లాంప్స్ సాయంతో తగిలించేసి.. పవర్ ఆన్ చేస్తే.. 5 నిమిషాల వ్యవధిలో తళతళలాడే తెలుపు మీ సొంతం. వీనస్ యంత్రం బరువు 2.1 కిలోలు. చిన్నసైజు బ్యాగులో పట్టేస్తుంది. అంటే.. మనం ఎక్కడికెళ్తే.. అక్కడికి తీసుకుపోవచ్చు. ప్రస్తుతం దీన్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా పెట్టుబడి కోసం పీయూష్ ఎదురుచూస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ సైట్ ‘ఇండిగోగో’ ద్వారా ప్రయత్నిస్తున్నారు. రూ.50 లక్షలు వస్తే.. ఉత్పత్తి ప్రారంభిస్తారు. 2015 మే సరికి మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నారు. ‘చాలాకాలం పాటు చేతులతో బట్టలు ఉతకడం వల్ల భుజం, నడుం నొప్పి వస్తుంది. రసాయనాలతో కూడిన డిటర్జెంట్లను వాడటం వల్ల చర్మ వ్యాధులు, దద్దుర్లు రావచ్చు. ముఖ్యంగా వాషింగ్‌మెషీన్ కొనుక్కోలేని అల్పాదాయ వర్గాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు.. ఇంటికి దూరంగా వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇప్పటికే కొన్నిటిని పరిమిత స్థాయిలో రూ.2,500 చొప్పున విక్రయించాం. భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఇది రూ.1,500 కే లభిస్తుంది.’ అని పీయూష్ చెప్పారు. త్వరలో బ్యాటరీతో పనిచేసే దాన్నీ తేవాలని యత్నిస్తున్నారు.