చిన్ని గుండెకు ఎంత కష్టం!
► గుండె పెరుగుదలతో బాధపడుతున్న పీయూష్
► గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరి
► రూ.30 లక్షలు ఖర్చవుతాయన్న వైద్యులు
► దాతల సహకారం కోరుతున్న బాబు తల్లి
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలుడికి పెద్ద కష్టం వచ్చింది. పదేళ్ల పీయూష్‌కు చిన్ని గుండె మోయలేని భారవైుంది. బాబు గుండె పెరిగిందని, గుండె మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. భర్త మరణంతో కుంగిన బాబు తల్లి జి.పద్మావతి తన బిడ్డను కాపాడాలంటూ దాతల సహకారం కోరుతోంది. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శని వారం ఆమె విలేకరుల సమావే శంలో తన ఆవేదన తెలిపింది.
పద్మావతి భర్త భిలాయ్‌లోని మహేంద్రటెక్‌లో పని చేసేవారు. వారికి బాబు పీయూష్ కుమార్, పాప భార్గవి ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో భర్త మరణించారు. ఆదరించాల్సిన అత్తామామలు అక్కడి నుంచి పంపించేయడంతో పద్మావతి పిల్లలతో సహా విశాఖలో చెల్లెలు ఇంటికి వచ్చేశారు. పీయూష్‌ను సమీపంలోని పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. ఆర్నెల్ల క్రితం పీయూష్‌కు కడుపునొప్పి రావడంతో ఓ వైద్యుడిని సంప్రదించగా ఆయన హృద్రోగ నిపుణుడిని కలవాలని సూచించారు. కేజీహెచ్‌లో పరీక్షించిన డాక్టర్లు బాబు గుండె మూడింతలైందని, రక్తప్రసరణ కష్టమవుతోందని చెప్పారు.
బాబు బతకాలంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన వద్ద ఉన్న కొద్ది సొమ్మును వైద్యానికే ఖర్చు చేశానని, దికు్కతోచని స్థితిలో దాతల సహకారం కోరుతున్నానని చెప్పారు. సాయం చేయాలనుకునేవారు జి.పద్మావతి, అకౌంట్ నంబరు 20324336 423, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మర్రిపాలెం శాఖ, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐ/015 630కు జమ చేయవచ్చని లేదా 75873 29589, 79976 37887 నంబర్లలో సంప్రదించి సాయం చేయవచ్చని కోరుతున్నారు.