
...అంటున్నారు సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరిది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి సౌండ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ‘రోబో’,‘కోచ్చడయాన్’, ‘2.0’ తదితర దక్షిణాది చిత్రాలతో పాటు ‘రా.వన్’ వంటి హిందీ చిత్రాలకూ, హాలీవుడ్ మూవీస్‌కూ సౌండ్ డిజైనర్‌గా చేశారాయన. ఇప్పటివరకూ తెరపై వినిపించినరసూల్, త్వరలో కనిపించబోతున్నారు. యస్.. ఆయన హీరోగా ‘ఒరు కథై సొల్లట్టుమ్మా’ అనే చిత్రం రూపొందుతోంది. అంటే.. ‘ఒక కథ చెప్పనా?’ అని అర్థం. మలయాళం, తెలుగు, తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
కేరళలోని తిరుచ్చూరులో ప్రతి ఏటా జరిగే ‘పూరమ్’ అనే ఉత్సవం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఆ ఉత్సవాల్లో జరిగే ప్రతి శబ్దాన్ని రికార్డ్ చేయాలని కలలు కనే ఓ సౌండ్ డిజైనర్‌చుట్టూ సినిమా సాగుతుంది. ప్రసాద్ ప్రభాకరన్ దర్శకుడు. చిత్రవిశేషాలను ఆయన చెబుతూ – ‘‘పూరమ్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మేమంతా అక్కడే ఉండి, చిత్రీకరించాం.హాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన 80 మంది సాంకేతిక నిపుణులు ఉత్సవాల్లోని శబ్దాలను రికార్డ్ చేశారు. 22 కెమెరాలతో షూట్ చేశాం. స్వతహాగా సౌండ్ డిజైనర్ అయిన రసూల్ నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment