జమ్మూ కశ్మీర్ 205/6 | With the Andhra Ranji match | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్ 205/6

Published Thu, Oct 20 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

With the Andhra Ranji match

ఆంధ్రతో రంజీ మ్యాచ్ 

 
ముంబై: ఆంధ్రతో ఆరంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్‌లో తడబడింది. గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి కశ్మీర్ 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభమ్ ఖజూరియా (238 బంతుల్లో 90; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా, రసూల్ (45) ఫర్వాలేదనిపించాడు. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్, విజయ్ కుమార్, భార్గవ్ భట్ తలా 2 వికెట్లు తీశారు.

 
కేరళ కట్టడి...

భువనేశ్వర్: హైదరాబాద్‌తో జరుగుతున్న మరో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి కేరళ 90 ఓవర్లలో 4 వికెట్లకు 223 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (58 బ్యాటింగ్), సచిన్ బేబీ (51 బ్యాటింగ్) ఐదో వికెట్‌కు అభేద్యంగా 114 పరుగులు జోడించారు. ఇతర బ్యాట్స్‌మెన్‌లో రోహన్ ప్రేమ్ (41) ఫర్వాలేదనిపించాడు. రవికిరణ్, మిలింద్, భండారి, హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement