అర్హులందరికీ పక్కా ఇళ్లు
Published Sat, Oct 29 2016 2:23 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో అర్హత గల పేదలకు 29,568 గృహాలు మంజూరు నిమిత్తం సంబంధిత నివేదికను నవంబర్ 5 లోగా సిద్ధం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ గృహ పథకం కింద 18 వేల ఇళ్లు మంజూరు నిమిత్తం సంబంధిత ఫైలు సిద్ధం చేయాలని, ఐఏవై పథకం కింద 6,272 గృహాలు అర్హత గల వారికి మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 5,296 గృహాలు మంజూరుకు నివేదికను సిద్ధం చేయాలన్నారు. జేసీ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ దీపం పథకం ద్వారా సర్వే పూర్తి చేయాలని 5వ తేదీ తరువాత సర్వే నిర్వహించేది లేదన్నారు. హౌసింగ్ పీడీ ఈ.శ్రీనివాసరావు, డ్వామా పీడీ డి.వెంకటరమణ, డీఎస్‌వో శివశంకర రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement