
అనంతపురం పట్టణంలో పేదలకు నిత్యావసరాలు పంచుతున్నఅల్ హస్‌నత్ చారిటబుల్ ట్రాస్ట్ నిర్వాహకులు. చిత్రంలో మంత్రి పల్లె కూడా ఉన్నారు.
అనంతపురం: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అనంతపురం పట్టణంలో నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అల్ హస్‌నత్ చారిటబుల్ ట్రాస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
పట్టణంలోని సురానీ మసీదులో నిర్వహించిన సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.