ఉచితంగా ఎంసెట్, పాలిటెక్నిక్‌ కోచింగ్‌ | free coaching | Sakshi
Sakshi News home page

ఉచితంగా ఎంసెట్, పాలిటెక్నిక్‌ కోచింగ్‌

Published Sun, Mar 19 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

free coaching

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని నిరుపేద విద్యార్థులకు ఐఐటీ రామయ్య కళాశాలలో ఎంసెట్, పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20 నుంచి ఉచితంగా కోచింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్‌యూఆర్‌డీఎస్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు అవ్వారి విజయగౌరి, అవ్వారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం స్థానిక కళాశాలలో కోచింగ్‌కు సంబంధించిన కరపత్రాలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు కోచింగ్‌ తీసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇలాంటి సమయంలో జిల్లాలోని పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడం సంతోషకరమన్నారు. అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 8519814337, 7702105119 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement