
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ అన్నయ్యా.. నేను, ఒక అబ్బాయి 3 ఇయర్స్‌గా లవ్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంటాం కానీ, అప్పుడప్పుడు క్యాజువల్‌గా గొడవలు అవుతుంటాయి. అన్నింటికీ తనే కాంప్రమైజ్ అయ్యి నన్ను కూల్ చేస్తుంటాడు. కానీ నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది చాలా న్యూస్‌లలో చూస్తున్నాం కదా.. తను కూడా అంతేనా? అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ నాతో అలా ప్రవర్తించలేదు. పైగా మా నేపథ్యాలు వేరు. నేను బాగా చదువుతా. తను అంతగా చదవడు. ఇంకా తను మాకన్నా ఆర్థికంగా పూర్ కూడా. ఇవన్నీ నాకు అవసరం లేదు కానీ, ఇంట్లో ఒప్పుకోరు. మా డాడ్ చాలా స్ట్రిక్ట్. అందుకే కావాలనే చాలాసార్లు గొడవ పెట్టుకుని విడిపోదాం అన్నా.
కానీ.. నా ఫ్యామిలీ గురించి ఆలోచించే ఇవన్నీ చేస్తున్నాని అర్థం చేసుకుని నాకు సర్దిచెప్పాడు. ఏం ఆలోచించకు మనం కలిసే అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అలా తను నాకు నచ్చజెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజమే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి.. మళ్లీ మామూలుగా అయిపోతున్నా. మళ్లీ తనని విపరీతంగా బాధపెట్టేస్తున్నా. మా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. దయచేసి సలహా చెప్పండి. – తులసి
జంప్ చెల్లెమ్మా.. జంప్. ఇమ్మీడియట్లీ జంప్ వెరీ ఫాస్ట్...
‘సార్...’
ఆపు.. నువ్వు అంతగా ఫీల్ అవ్వొద్దు నీలాంబరి..!
‘సార్..’
వద్దు!
‘ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాయి సార్..’
ఎందుకు ఫీలింగ్?
‘అబ్బాయి పవిత్రంగా లవ్ చేస్తున్నాడు కదా సార్!’
అవునా?
‘అవునా ఏంటి అవునా.. మీ మనస్సుకు కళ్లు లేవు సార్ యు ఆర్ బ్లైండ్!!’
గుడ్డి మనసా నాదీ...?
‘ముమ్మాటికీ.. అదే అమ్మాయి... అబ్బాయి లేకుండా బతకలేను అని రాస్తే.. అబ్బాయిని ముప్పుతిప్పలు పెట్టేవారు. అమ్మాయి పేరెంట్స్ గురించి ఆలోచించి అబ్బాయిని లైట్ తీసుకుంటోంది కాబట్టి మీ ఫీలింగ్స్ బ్లైండ్‌గా సార్..’
నీ ఫీలింగ్‌లోనే ఆన్సర్ ఉంది.. అమ్మాయి పేరెంట్స్‌ని బాధ పెట్టకూడదు అనుకుంటోంది.. అలాంటప్పుడు జంప్ చెల్లెమ్మా.. జంప్!!
‘మీకు అరటిపండు జంప్.. జంప్ సార్!!’
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com