నైవైద్యం | Government hospital in problems | Sakshi
Sakshi News home page

నైవైద్యం

Published Wed, Sep 9 2015 3:33 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

నైవైద్యం - Sakshi

నైవైద్యం

అసలే వ్యాధుల కాలం. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యశాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగరానికి ఆయువుపట్టు అయిన ప్రభుత్వాస్పత్రులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వైద్యుల కొరత, స్టాక్‌లేని మందులు, అసౌకర్యాల లేమితో ప్రభుత్వాస్పత్రిలో వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వాస్పత్రుల్లోని సేవలు, సమస్యలపై సోమవారం ‘సాక్షి విజిట్’ నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
 
- అడుగడుగునా ఇబ్బందులే..    
- ఓపీ చీటీలు తీసుకోవడమే అగ్నిపరీక్ష
- ఎక్స్‌రే తీయాలంటే మూడు గంటల నిరీక్షణ
- గర్భిణులకు నరకయాతన
- అందుబాటులో లేని లేబొరేటరీ పరీక్షలు    
సాక్షి ప్రతినిధి, విజయవాడ:
నిరుపేదలకు వైద్య భరోసా ఇవ్వాల్సిన సర్కారు ఆస్పత్రి సమస్యలతో కునారిల్లుతోంది. రోగం బారిన పడి చికిత్సకోసం వచ్చిన రోగులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య పరీక్షల కోసం ఓపీ చీటీ తీసుకునేందుకే గంటన్నరపాటు క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్స్‌రేకోసం నాలుగు గంటలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి. గర్భిణులకు లేబొరేటరీల్లో పరీక్షలు అందుబాటులో లేక బయట ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అత్యసవర వైద్యానికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో నిరుపేదలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించేందుకు ‘సాక్షి’ నెట్‌వర్క్ సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు విజిట్ నిర్వహించింది.  
 
నగరానికి చెందిన సూర్యనారాయణ (60) యూరిన్ ప్రాబ్లమ్ రావడంతో రెండు రోజుల కిందట ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆయనకు మూత్రపిండాల్లో సమస్య రావడంతో ఇక్కడ వైద్యం అందుబాటులో లేదని వైద్యులు గుంటూరుకు రిఫర్ చేశారు. రూ.3వేలు అంబులెన్స్‌కు చెల్లించి గుంటూరు తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
- మొవ్వ మండలం నిడుమోలుకు చెందిన గర్భిణి నాగలక్ష్మి ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు కవలలు పుట్టడంతో బరువు తక్కువగా ఉన్నారని ఎన్‌ఐసీయూలో ఉంచారు. శిశువుల్లో ఒకరు మృతిచెందారు, రెండో శిశువును వెంటిలేటర్‌పై  ఉంచాలని, ప్రస్తుతం  ఖాళీలేదని చెప్పడంతో కార్పొరే ట్ ఆస్పత్రికి  వెళ్లారు.
- నడవలేని స్థితిలో ఉన్న రోగులను వార్డుల నుంచి స్కానింగ్, ఇతర పరీక్షలకు ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌ఓలు తీసుకెళ్లాల్సిఉంది. నాలుగో తరగతి సిబ్బంది కొరత ఉండడంతో  బంధువులే వీల్‌చైర్‌లు, స్ట్రెచర్‌లపై రోగులకు తీసుకెళ్లడం సర్వసాధారణంగా మారింది.
- జిల్లాలోని 45 లక్షల మంది జనాభాకు వైద్యమందించే సర్కార్ ఆస్పత్రిలో సౌకర్యాలు లేవు. నిత్యం నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి  రోగులు చికిత్స కోసం వస్తుంటారు. కొత్తాస్పత్రికి రోజుకు 700 మంది, పాత ఆస్పత్రికి  500 మంది అవుట్‌పేషెంట్స్ వస్తుంటారు. సుమారు 750 మంది ఇన్ పేషెంట్స్ ఉంటారు.
 
ఓపీ చీటీలంటే సహనానికి పరీక్ష

కొత్తాస్పత్రిలో ఓపీ చీటీలిచ్చేందుకు రోగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. సోమవారం ఓపీ పరీక్షల కోసం 800 మంది వచ్చారు. వారికి చీటీలు ఇచ్చేందుకు ఒకే కంప్యూటర్ ఉండడం, ప్రింటర్ పనిచేయకపోవడంతో చేతితో రాసివ్వడం వల్ల తీవ్ర జాప్యం జరిగింది. రోగులు గంటన్నరపాటు క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి నెలకొంది.  
 
ఎక్స్‌రేకు నాలుగు గంటలు
ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్‌రే తీయించుకోవాలంటే మూడు నుంచి నాలుగు గంటలు వేచి ఉండాల్సిందే. కొత్తాస్పత్రితోపాటు పాత ప్రభుత్వాస్పత్రిలోనూ ఇదే దుస్థితి నెలకొంది. సోమవారం ఎక్స్‌రే విభాగానికి వెళ్లి ఎవరిని కదిలించినా ఇదే సమస్య చెప్పారు. ఉదయం 9 గంటలకు వచ్చామని, మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఎక్స్‌రే తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇక్కడ 16 మంది రేడియోగ్రాఫర్లు పనిచేయాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
 
ఉదయం 11.30 గంటలు దాటితే పరీక్షలుండవు
ప్రసూతి విభాగంలో ఉదయం 11.30 గంటల వరకే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఆ సమయం దాటితే పరీక్షల కోసం మరుసటి రోజు రావాల్సిందే. అవుట్‌పేషెంట్ విభాగంలో 12.30 గంటల వరకూ రోగులకు పరీక్షలు చేస్తారు.  11.30 తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్న గర్భిణులు పరీక్షల కోసం మరుసటి రోజు రావాల్సిందే. అత్యవసరమైతే ప్రైవేట్ లేబొరేటరీలను ఆశ్రయించాలి. కొత్తాస్పత్రిలో సైతం 12 గంటలు దాటితే పరీక్షలు అందుబాటులో ఉండవు. ఇక్కడ 24 గంటల వ్యాధి నిర్ధారణ పరీక్షలు కలగానే మిగిలిపోయింది.
 
ప్రైవేట్ మెడికల్ షాపు వద్ద క్యూ
మందులు కొనుగోలు చేసేందుకు ప్రైవేటు మందుల షాపుల వద్ద ఓపీ సమయంలో రోగులు క్యూలో నిల్చున్నారు. అంటే ప్రభుత్వం సరఫరా చేసే మందులు అరకొరగా ఉంటున్నాయని, అక్కడి రోగులను చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. రామవరప్పాడుకు చెందిన నర్సమ్మ అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే మందులు రాయడంతో కొనుగోలు చేసేందుకు రూ.380 అయినట్లు చెప్పి ంది. రోగులు ఎక్కువమంది ప్రైవేట్ మెడికల్ షాపులోనే మందులు కొన్నారు. ఆస్పత్రి ఆవరణలోనే ప్రైవేట్ మెడికల్ షాపునకు పర్మిషన్ ఇచ్చి పెట్టించారు.
 
తక్షణ వైద్యం ఏదీ?
ప్రాణాపాయస్థితిలో వచ్చిన వారికి తక్షణ వైద్యం అందించాలి. వెంటిలేటర్ ఒకటి ఉన్నా అది పనిచేయడం లేదు. నిబంధనల ప్రకారం మొబైల్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాలు అందుబాటులో ఉండాలి. అవేమి ఇక్కడ కనిపించవు. పల్స్ ఆక్సీమీటర్లు, పారామీటర్లు అందుబాటులో లేవు. ఇక సక్షన్స్ పనిచేయవు. ఎమర్జెన్సీకి ప్రాణాపాయంలో వచ్చిన రోగులకు చికిత్స అందించాలంటే వైద్యులు పనిచేయని పరికరాలతో కుస్తీపట్టాల్సిన దుస్థితి నెలకొంది. విజిట్ సమయంలో అత్యవసర చికిత్సకు 18 మంది వచ్చారు.
 
నడవలేమన్నా కనికరం లేదు..
కీళ్ల సంబంధిత వ్యాధితో నా భర్త కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. నడవలేని పరిస్థితిలో ఉన్న ఈయనను ఎంతో ప్రయాసపడి నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చా. నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పినా వీల్‌చైర్ ఏర్పాటు చేయలేదు. దాదాపు అరగంటసేపు ఎదురుచూసి అతికష్టం మీద  నడిపించి క్యాజువాలిటీ వద్దకు తీసుకువచ్చా.    
- వెంకమ్మ, కంకిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement