అందుబాటులోకి తేవాలని టీటీడీ నిర్ణయం
సాక్షి, తిరుమల: మూడేళ్లుగా భక్తులకు అందుబాటులో లేని శ్రీవారి 2 గ్రాముల బంగారు డాలర్లతో పాటు వెండి డాలర్ల విక్రయానికీ టీటీడీ చర్యలు చేపట్టింది. వీటితోపాటు కొత్తగా రాగి డాలర్లనూ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఉత్తర్వులిచ్చారు.
డాలర్ల కొరతపై ‘సాక్షి’ వరుస కథనాలు
తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. మూడేళ్లుగా డాలర్ల విక్రయ కేంద్రంలో 3,5 గ్రాముల వెండి డాలర్లు, రెండు గ్రాముల బంగారు డాలర్లు స్టాకు సైతం రెండేళ్లుగా లేదు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో టీటీడీ ఈవో సాంబశివరావు స్పందించారు. ఈ డాలర్లను తిరిగి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. అది కూడా బంగారు స్వచ్ఛత తెలిపే హాల్‌మార్క్‌తోనే బంగార్లు డాలర్లు విక్రయించాలని ఉత్తర్వులిచ్చారు. అలాగే పేద భక్తుల కోసం తక్కువ ధరతో రాగి డాలర్లు విక్రయించాలని నిర్ణయించారు.